ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Yanam: యానాం పెట్రో ఉత్పత్తుల బ్లాక్‌ మార్కెటింగ్‌ పిల్‌ కొట్టివేత

ABN, Publish Date - May 14 , 2025 | 04:59 AM

యానాంలో పెట్రోలియం ఉత్పత్తుల బ్లాక్‌ మార్కెట్‌పై సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిల్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయని, ప్రత్యేక కారణాలు లేనందున సీబీఐ దర్యాప్తు అవసరం లేదని పేర్కొంది.

సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు నిరాకరణ

అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): యానాంలో విక్రయించడానికి, వినియోగించడానికి ఉద్దేశించిన పెట్రోలియం ఉత్పత్తులను ఏపీలో బ్లాక్‌ మార్కెటింగ్‌ చేస్తున్నారని, ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది. అక్రమాలకు పాల్పడుతున్న రిటైల్‌ అవుట్‌ లెట్లపై ఇప్పటికే పెట్రోలియం కంపెనీలు చర్యలు తీసుకున్నాయని తెలిపింది. రాష్ట్ర పోలీసులు విఫలమయ్యారనేందుకు ఆధారాలతో పాటు ప్రత్యేక పరిస్థితులు, అరుదైన సందర్భాలలో మాత్రమే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చిందని గుర్తు చేసింది. రిటైల్‌ అవుట్‌ లెట్లలో అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారని పేర్కొంది. దర్యాప్తును సీబీఐకి అప్పగించేందుకు నిర్ధిష్ట కారణాలు లేవంటూ పిల్‌ను కొట్టివేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. రాజమండ్రికి చెందిన భీమా నాగరమేష్‌ ఈ పిల్‌ను దాఖలు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్

CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ

Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..

Updated Date - May 14 , 2025 | 05:00 AM