ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP High Court: విచారణకు అందుబాటులో ఉండండి

ABN, Publish Date - Jun 06 , 2025 | 04:52 AM

తిరువూరు నగరపంచాయతీ ఎన్నిక సందర్భంగా కిడ్నాప్‌, తదితర సెక్షన్ల కింద నమోదైన నాలుగు కేసుల్లో దర్యాప్తు అధికారి కోరినప్పుడు విచారణకు అందుబాటులో ఉండాలని, దర్యాప్తునకు సహకరించాలని వైసీపీనేత దేవినేని అవినాశ్‌ను హైకోర్టు ఆదేశించింది.

  • దేవినేని అవినాశ్‌కు హైకోర్టు ఆదేశం

అమరావతి, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): తిరువూరు నగరపంచాయతీ ఎన్నిక సందర్భంగా కిడ్నాప్‌, తదితర సెక్షన్ల కింద నమోదైన నాలుగు కేసుల్లో దర్యాప్తు అధికారి కోరినప్పుడు విచారణకు అందుబాటులో ఉండాలని, దర్యాప్తునకు సహకరించాలని వైసీపీనేత దేవినేని అవినాశ్‌ను హైకోర్టు ఆదేశించింది. ఆయనకు బీఎన్‌ఎఎ్‌సఎస్‌ సెక్షన్‌ 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులకు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కుంచం మహేశ్వరరావు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు నగరపంచాయతీ ఎన్నిక సందర్భంగా ఎన్టీఆర్‌ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్‌తో మాట్లాడాలంటూ తన మరదలు షేక్‌ నదియా, ఆమె భర్తను మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్‌ తీసుకెళ్లి నిర్బంధించారంటూ షేక్‌ మస్తాన్‌ ఈనెల 20న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా అవినాశ్‌, స్వామిదా్‌సపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ అవినాశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. గురువారం వ్యాజ్యం విచారణకు వచ్చింది. ప్రాసిక్యూషన్‌ తరఫున పీపీ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తు అధికారి కోరినప్పుడు విచారణకు హాజరయ్యేలా పిటిషనర్‌ను ఆదేశించాలని కోరారు.

Updated Date - Jun 06 , 2025 | 04:53 AM