ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rain Alert: చురుగ్గా నైరుతి

ABN, Publish Date - Jul 20 , 2025 | 03:57 AM

దక్షిణ కోస్తా మీదుగా తూర్పు, పడమరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. ఇంకా బిహార్‌ నుంచి జార్ఖండ్‌ మీదుగా ఒడిశా వరకు మరో ద్రోణి కొనసాగుతోంది.

  • నేడు, రేపు పలుచోట్ల భారీ వర్షాలు

  • 24న బంగాళాఖాతంలో అల్పపీడనం

విశాఖపట్నం/అమరావతి, జూలై 19 (ఆంధ్రజ్యోతి): దక్షిణ కోస్తా మీదుగా తూర్పు, పడమరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. ఇంకా బిహార్‌ నుంచి జార్ఖండ్‌ మీదుగా ఒడిశా వరకు మరో ద్రోణి కొనసాగుతోంది. కోస్తా, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో కొనసాగిన ఎండ తీవ్రతతో వాతావరణంలో అనిశ్చితి నెలకొంది. వీటన్నింటి ప్రభావంతో శనివారం పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు, అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతుండటంతో బంగాళాఖాతం నుంచి భారీగా వచ్చే తేమగాలులతో ఈ నెల 23 వరకూ రాష్ట్రంలో వర్షాలు, అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా 24న ఉత్తర ఒడిశాకు ఆనుకుని బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో వర్షాలు కురిసే వాతావరణం కొనసాగుతుందని వివరించింది. కాగా, రాష్ట్రంలో రానున్న 48 గంటల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. ఆదివారం అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

తాడిపత్రిలో టెన్షన్‌ టెన్షన్‌

ప్రభుత్వ బడుల్లో నో వేకెన్సీ పరిస్థితి తేవాలి

Read latest AP News And Telugu News

Updated Date - Jul 20 , 2025 | 03:59 AM