ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Health Department: కొనుగోళ్లలో కాసుల వర్షం

ABN, Publish Date - Jun 22 , 2025 | 03:48 AM

ఆరోగ్యశాఖలో వైద్య పరికరాల కొనుగోళ్లు అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఆస్పత్రులకు అవసరం ఉన్నా లేకున్నా.. కోట్ల విలువైన పరికరాలను కొనుగోలు చేయడంతో ప్రజాధనం వృథా అవుతోంది.

  • ఆరోగ్యశాఖలో ఇష్టారాజ్యంగా వైద్య పరికరాల కొనుగోలు

  • అనంత ఆస్పత్రిలో రూ.16 కోట్ల ప్రజాధనం వృథా

  • రూ.8 కోట్ల పరికరాలు 2 సార్లు కొన్న వైనం

  • రహస్యంగా బిల్లులు చెల్లించాలని నిర్ణయం

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశాఖలో వైద్య పరికరాల కొనుగోళ్లు అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఆస్పత్రులకు అవసరం ఉన్నా లేకున్నా కోట్ల విలువైన పరికరాలను కొనుగోలు చేయడంతో ప్రజాధనం వృథా అవుతోంది. అనంతపురం, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు మెడికల్‌ కాలేజీల్లో అవసరం లేకుండా కోట్ల విలువైన పరికరాలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అనంతపురం ఆస్పత్రిలో ఒకే రకమైన వైద్య పరికరాలను రెండుసార్లు కొనుగోలు చేయడం గమనార్హం. ఇక్కడ తొలుత రూ.8 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన వైద్య పరికరాలనే సిబ్బంది సక్రమంగా ఉపయోగించడం లేదు. ఇప్పుడు మళ్లీ మరో రూ.8 కోట్లు వెచ్చించి అవే పరికరాలను కొనుగోలు చేశారు. డీఎంఈలో ఈ విధమైన దుర్వినియోగం కొన్నేళ్ల నుంచి నడుస్తోంది. కొన్ని కంపెనీలకు మేలు చేసే క్రమంలో, సొంత లాభం కూడా చూసుకుని.. ఆస్పత్రులకు అవసరం లేని వైద్య పరికరాలను కొనుగోలు చేస్తున్నారు.

సమన్వయ లోపం..

డీఎంఈ పరిధి ఆస్పత్రుల్లో అవసరమైన వైద్య పరికరాలు, వాటి ఉపయోగం వంటి వ్యవహారాలు మొత్తం డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అధికారులు చూసుకోవాలి. ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో పాటు ఏపీఎంఎ్‌సఐడీసీ అధికారులతో సమన్వయం చేసుకుని కొత్త, పాత వైద్య పరికరాల విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి. కానీ, అనంతపురంలో రూ.8 కోట్ల చొప్పున రెండుసార్లు రూ.16 కోట్లతో అవసరం లేని వైద్య పరికరాలు కొనుగోలు చేశారంటే రెండు విభాగాల మధ్య సమన్వయం లోపించిందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది రాష్ట్రంలోని మెడికల్‌ కాలేజీల్లో దాదాపు 730 పీజీ సీట్లు పెంచింది. వీటితోపాటు సౌకర్యాల కల్పనకు రూ.756 కోట్ల నిధులు అందించింది. పీజీ సీట్ల పెంపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను డీఎంఈ అధికారులు ప్రతి కాలేజీకి రూ.8 నుంచి రూ.10 కోట్ల వరకూ అందించారు.

ఆ నిధులను ఏపీఎంఎ్‌సఐడీసీ ద్వారా ఆయా ఆస్పత్రుల్లో అవసరమైన వైద్య పరికరాలు కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది. మరోవైపు అనంతపురంలో గత ప్రభుత్వం నాడు-నేడు పేరుతో కొత్త ఆస్పత్రి భవనం నిర్మాణం చేపట్టింది. ఆస్పత్రి భవన నిర్మాణంతో పాటు అవసరమైన కొన్ని వైద్య పరికరాల కొనుగోలుకు ఎల్‌ 1 కాంట్రాక్ట్‌ సంస్థతో ఏపీఎంఎ్‌సఐడీసీ అధికారులు అగ్రిమెంట్‌ చేసుకున్నారు. ఒకవైపు ఆ పనులు జరుగుతున్నాయి. మరోవైపు పీజీ సీట్లకు అవసరమైన వైద్య పరికరాల కొనుగోలుకు ఏపీఎంఎ్‌సఐడీసీ అధికారులు టెండర్లు ఆహ్వానించి, వాటిని కొనుగోలు చేసి అనంతపురం ఆస్పత్రికి అందజేశారు. అయితే దీని కంటే ముందే అనంతపురం సూపరింటెండెంట్‌.. డీఎంఈకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కాంట్రాక్ట్‌ సంస్థ నుంచి రూ.8 కోట్ల విలువైన వైద్య పరికరాలు కొనుగోలు చేయించారు. చివరికి ఈ విషయం బయటకు పోక్కనీయకండా ఇటు డీఎంఈ అధికారులు, ఏపీఎంఎ్‌సఐడీసీ అధికారులు అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఉత్తుత్తి విచారణ..

అనంత ఆస్పత్రికి కొనుగోలు చేసిన పరికరాల విషయంపై విజయవాడ డీఎంఈ కార్యాలయం నుంచి ఇద్దరు కీలక అధికారులు విచారణకు వెళ్లారు. అనంత మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో ఒకే రకమైన వైద్య పరికరాలు రెండుసార్లు కొనుగోలు చేశారని గుర్తించారు. ఆ తర్వాత అంతా గప్‌చుప్‌. ఒక్క అధికారిపైనా చర్యలు తీసుకోలేదు. కనీసం మెమో ఇవ్వలేదు. తప్పు చేసిన వారిని సస్పెండ్‌ చేయలేదు. కొసమెరుపు ఏమిటంటే.. రెండోసారి కొనుగోలుకు సంబంధించి కాంట్రాక్ట్‌ సంస్థకు రూ.8 కోట్లు బిల్లులు ఇచ్చేసేందుకు డీఎంఈ అధికారులు సిద్ధమవుతున్నారు.

Updated Date - Jun 22 , 2025 | 03:48 AM