supreme court: సుప్రీం నియమించిన సిట్‌లో మీరు లేరు నోటీసు ఇవ్వలేరు
ABN, Publish Date - Jun 20 , 2025 | 06:29 AM
సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్‌లో ఆయన సభ్యుడిగా లేరని గుర్తు చేసింది. సర్వోన్నత న్యాయస్థానం అనుమతి లేకుండా వెంకట్రావు నోటీసులు ఇచ్చి, దర్యాప్తు చేయడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని అభిప్రాయపడింది.
అదనపు ఎస్పీ వెంకట్రావుకు హైకోర్టు స్పష్టీకరణ
అమరావతి, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూ తయారీకి నకిలీ నెయ్యి సరఫరా కేసులో సుప్రీంకోర్టు అనుమతి లేకుండా అదనపు ఎస్పీ జె.వెంకట్రావును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)లో దర్యాప్తు అధికారిగా నామినేట్ చేస్తూ సీబీఐ డైరెక్టర్ ప్రొసీడింగ్స్ ఇవ్వడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్‌లో ఆయన సభ్యుడిగా లేరని గుర్తు చేసింది. సర్వోన్నత న్యాయస్థానం అనుమతి లేకుండా వెంకట్రావు నోటీసులు ఇచ్చి, దర్యాప్తు చేయడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని అభిప్రాయపడింది. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. విచారణను జూలై 3కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు.
Updated Date - Jun 20 , 2025 | 06:29 AM