ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రూ.5 లక్షలు జమ చేశాకే పిల్‌పై విచారణ

ABN, Publish Date - Jun 19 , 2025 | 05:12 AM

పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల మృతిపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయంచాలని పిల్‌ వేసిన మాజీ ఎంపీ హర్షకుమార్‌ను రూ.5లక్షలు రిజిస్ట్రీ వద్ద జమ చేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

  • మాజీ ఎంపీ హర్షకుమార్‌కు హైకోర్టు స్పష్టీకరణ

అమరావతి, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల మృతిపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయంచాలని పిల్‌ వేసిన మాజీ ఎంపీ హర్షకుమార్‌ను రూ.5లక్షలు రిజిస్ట్రీ వద్ద జమ చేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఆ తరువాతే పిల్‌ విచారణ చేపడతామని స్పష్టం చేసింది. ప్రవీణ్‌ హత్యకు గురయ్యారని చెప్పేందుకు ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించింది.

ప్రవీణ్‌ మరణంపై విచారణకు ఆదేశించాలని కోరుతూ పిల్‌ వేయడానికి పిటిషనర్‌ ప్రవీణ్‌ కుటుంబ సభ్యులు కాదు కదా? అని ప్రశ్నించింది. ఇదే వ్యవహారంతో ముడిపడి ఉన్న ప్రజాప్రయోజన వ్యాజ్యాలతో ప్రస్తుత పిల్‌ను జత చేయాలని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్‌జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. హర్షకుమార్‌ తరపున న్యాయవాది బాలయ్య వాదనలు వినిపించారు.

Updated Date - Jun 19 , 2025 | 05:12 AM