ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chebrolu Kiran Kumar Arrest: వైఎస్ జగన్ సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు.. నిందితుడు అరెస్టు..

ABN, Publish Date - Apr 10 , 2025 | 04:11 PM

వైఎస్ భారతిరెడ్డిపై టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో టీడీపీ అధిష్ఠానం సూచన మేరకు నిందితుడిపై కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు అతని సెల్ టవర్ లొకేషన్‌ను పోలీసులు గుర్తించారు.

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డి(YS Bharathi Reddy)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ కుమార్(Chebrolu Kiran Kumar)ను పోలీసులు అరెస్టు చేశారు. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడ, ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam) ప్రాంతంలో కిరణ్ ఉన్నట్లు గుర్తించిన గుంటూరు జిల్లా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. సోమవారం రోజున వైఎస్ భారతిపై నిందితుడు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అతని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‍గా మారడంతో విషయం కాస్త టీడీపీ పెద్దల వద్దకు చేరింది.


ఈ మేరకు సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఇవాళ(శుక్రవారం) కిరణ్ కుమార్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది. అలాగే నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని గుంటూరు జిల్లా పోలీసులకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో కిరణ్ కుమార్ లొకేషన్‌ను గుర్తించిన పోలీసులు వెంటనే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం చేరుకుని అరెస్టు చేశారు. ఏపీలో కిరణ్ అసభ్యకర వ్యాఖ్యల వీడియో పెద్దఎత్తున రాజకీయ దుమారాన్ని రేపింది. దీనిపై అధిష్ఠానం సీరియస్ అయిన వెంటనే.. "నా మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించమని కోరుతున్నా. ఈ వ్యాఖ్యలు ఎలాంటి దురుద్దేశంతో చేయలేదు. క్షణికావేశంలో మాత్రమే చేశా. క్షమించండి” అంటూ కిరణ్ కుమార్ మరో వీడియో విడుదల చేశాడు.


అయినా పార్టీ అధిష్ఠానం మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రతిపక్ష, స్వపక్ష నేతల భార్యలు, వారి ఇళ్లలోని మహిళపై ఎవరైనా కామెంట్లు చేస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే హెచ్చరించారు. అయినా పార్టీ లైన్ దాటి వ్యాఖ్యలు చేయడంతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కిరణ్ కుమార్ అరెస్టయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Vontimitta Temple: ఒంటిమిట్ట రాములోరి కల్యాణం.. ఆ మార్గాల్లో అస్సలు వెళ్లకండి..

Online Betting Games.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

శాంతి చ‌ర్చ‌ల‌పై మావోయిస్టు పార్టీ తాజా స్పంద‌న‌

Updated Date - Apr 10 , 2025 | 04:36 PM