ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan: పర్యావరణ పరిరక్షణపై పవన్ కల్యాణ్ కీలక సూచనలు

ABN, Publish Date - Feb 01 , 2025 | 08:56 PM

Pawan Kalyan: పర్యావరణ పరిరక్షణపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేశారు. పర్యావరణంలో చిత్తడి భూముల ప్రాధాన్యాన్ని అందరం గుర్తించాలని.. ఇవి సహజ నీటి శుద్ధి కేంద్రాలని అన్నారు.

Pawan Kalyan

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 25,000కు పైగా చిత్తడి నేలలు ఉన్నాయని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. చిత్తడి నేలలు పరిరక్షించుకోవాలని చెప్పారు. ప్రకృతిలో అత్యంత విలువైన పర్యావరణ వ్యవస్థల్లో చిత్తడి నేలలు ప్రధానమైనవని అన్నారు. ఈ రోజు ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవమని గుర్తుచేశారు. ఈ సందర్భంగా పర్యావరణంలో చిత్తడి భూముల ప్రాధాన్యాన్ని అందరం గుర్తించాలని.. ఇవి సహజ నీటి శుద్ధి కేంద్రాలని అన్నారు. ఈరోజు(శనివారం) ఏపీ సచివాలయంలో మీడియాతో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... ఈ భూములు భూకంప ఉద్ధృతిని తగ్గించడంలో, వాతావరణ మార్పులను నియంత్రించడంలో, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పవన్ కల్యాణ్ చెప్పారు.


వీటిలో ప్రముఖమైనది కొల్లేరు సరస్సు. ఇది రామ్‌సర్ సైట్‌గా గుర్తింపు పొందిన భారతదేశంలోని అతి పెద్ద తీపినీటి సరస్సుల్లో ఒకటని అన్నారు. అలాగే, దేశంలో రెండో అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు పులికాట్ సరస్సు అని చెప్పారు. సముద్ర జీవజాలానికి కీలకమైన ఉప్పుటేరు వాతావరణ వ్యవస్థ కూడా ఉన్నాయని అన్నారు. ఈ భూములు పక్షుల సంరక్షణకు, మత్స్య సంపదకు మాత్రమే కాదని వ్యవసాయానికి ఉపయోగపడుతూ వేలాది మంది ప్రజలకు జీవనాధారం అందిస్తున్నాయని పవన్ కల్యాణ్ వివరించారు.


ఈ విలువైన వనరులను రక్షించడానికి మన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఆక్రమణలను నివారించేందుకు, భౌగోళిక పరిమితులను ఖచ్చితంగా నిర్థారించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని.. మన అందరి బాధ్యత అని చెప్పుకొచ్చారు. మనం దానిని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. స్వప్రయోజనాలను తగ్గించుకోవడం ద్వారా మాత్రమే ప్రకృతిని కాపాడగలమని చెప్పారు. ప్రతి చిన్న ప్రయత్నం సమష్టిగా మొదలైతే పెద్ద మార్పునకు దారి తీస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Updated Date - Feb 01 , 2025 | 08:59 PM