ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Guntur: 88 ఏళ్ల వృద్ధుడికి స్వరపేటిక శస్త్రచికిత్స

ABN, Publish Date - Apr 17 , 2025 | 03:25 AM

గుంటూరులో 88 ఏళ్ల లక్ష్మణరావుకు అరుదైన శాండ్‌విచ్‌ థైరోప్లాస్టీ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. వైద్య చరిత్రలో ఈ శస్త్రచికిత్స చేయించుకున్న అతిపెద్ద వయస్కుడిగా గుర్తింపు పొందారు

  • గుంటూరులో అరుదైన శాండ్‌విచ్‌ థైరోప్లాస్టీ

  • ఈ సర్జరీ చేయించుకున్న పెద్ద వయస్కుడిగా లక్ష్మణరావు

  • నటుడు మురళీమోహన్‌కు బావ

గుంటూరు మెడికల్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): స్వరపేటిక పక్షవాతానికి గురై గొంతు బొంగురుపోయిన 88 ఏళ్ల వృద్ధుడికి గుంటూరు వికాస్‌ హాస్పిటల్‌లో అరుదైన శాండ్‌విచ్‌ థైరోప్లాస్టీ శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ శస్త్రచికిత్స చేయించుకున్న అతిపెద్ద వయస్కుడిగా ఆ వృద్ధుడికి గుర్తింపు లభించినట్లు శస్త్రచికిత్స చేసిన వాయిస్‌ సర్జన్‌ డాక్టర్‌ వీ ఫణీంద్రకుమార్‌ తెలిపారు. గుడివాడకు చెందిన లక్ష్మణరావు సినీనటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్‌కు స్వయానా బావ. ఎనిమిది నెలల క్రితం లక్ష్మణరావుకు గొంతు బొంగురుపోవడం, స్పష్టంగా మాట్లాడలేకపోవడంతో ఇటీవల చికిత్స కోసం గుంటూరులోని డాక్టర్‌ ఫణీంద్రకుమార్‌ను కలిశారు. వైద్యపరీక్షల్లో బాధితుడు ఓకల్‌కార్డ్‌ పెరాలసి్‌సకు గురైనట్లు ఆయన గుర్తించారు. గుంటూరులోని వికాస్‌ హాస్పిటల్స్‌లో లక్ష్మణరావుకు శస్త్రచికిత్స నిర్వహించారు.

Updated Date - Apr 17 , 2025 | 03:26 AM