ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Group 1 Mains 2025: గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలు విడుదల

ABN, Publish Date - Jun 11 , 2025 | 04:00 AM

గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలను ఏపీపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. మొత్తం 89 పోస్టుల భర్తీ కోసం 2023లో విడుదల చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించిన మెయిన్స్‌ పరీక్షలు...

  • 224 మంది అభ్యర్థుల ఎంపిక

  • 23 నుంచి 30 వరకు ఇంటర్వ్యూలు

అమరావతి, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలను ఏపీపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. మొత్తం 89 పోస్టుల భర్తీ కోసం 2023లో విడుదల చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించిన మెయిన్స్‌ పరీక్షలు మే 3 నుంచి 9 వరకు జరిగాయి. ఆ పరీక్షల ఫలితాలను ఇప్పుడు ప్రకటించింది. జనరల్‌ కోటాలో 182 మంది, స్పోర్ట్స్‌ కోటాలో 42 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. స్పోర్ట్స్‌ కోటా పోస్టుల భర్తీలో భాగంగా ఈ నెల 17 నుంచి ఏపీపీఎస్సీ కార్యాలయంలో క్రీడా ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తారు. వాటిని శాప్‌కు పంపి, శాప్‌ నిర్ధారించిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. జనరల్‌ అభ్యర్థులకు ఈనెల 23 నుంచి 30 వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. అనంతరం తుది ఫలితాలు ప్రకటిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు వ్యక్తిగతంగా సమాచారం అందుతుందని, ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తీసుకురావాలని కమిషన్‌ స్పష్టం చేసింది.

Updated Date - Jun 11 , 2025 | 04:01 AM