ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pemmasani : గ్రామీణ సాధికారతతోనే వికసిత్‌ భారత్‌

ABN, Publish Date - Jun 07 , 2025 | 03:27 AM

దేశంలోని గ్రామీణ ప్రాంతాలు సాధికారత సాధించినప్పుడే వికసిత్‌ భారత్‌ సాధ్యమవుతుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు.

  • రీజనల్‌ రూరల్‌ వర్క్‌షాప్‌లో కేంద్ర మంత్రి పెమ్మసాని

న్యూఢిల్లీ, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): దేశంలోని గ్రామీణ ప్రాంతాలు సాధికారత సాధించినప్పుడే వికసిత్‌ భారత్‌ సాధ్యమవుతుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తేనే వికసిత్‌ భారత్‌ నిర్మితమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(గ్రామీణ)’ కార్యక్రమంలో భాగంగా గోవాలో శుక్రవారం నిర్వహించిన రీజనల్‌ రూరల్‌ వర్క్‌షా్‌పలో కేంద్ర మంత్రి పెమ్మసాని మాట్లాడారు. ‘2029 మార్చి నాటికి 4.95 కోట్ల గృహాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో భాగంగా 3.69 కోట్ల గృహాలు మంజూరు చేశాం. అందులో 2.76 కోట్ల గృహాల నిర్మాణాలు పూర్తి అయ్యాయి. పీఎంఏవై(జీ)ని ఉజ్వల యోజన, జల్‌ జీవన్‌ మిషన్‌, స్వచ్ఛ భారత్‌ వంటి పథకాలతో సమన్వయం చేయడం ద్వారా ప్రతి గ్రామీణ కుటుంబానికి శుద్ధి చేసిన తాగు నీరు, మరుగుదొడ్లు, వంట గ్యాస్‌ అందించేలా కృషి చేస్తున్నాం. పర్యావరణాన్ని కాపాడుతూ అందరికీ అందుబాటులో ఉండే ఇళ్లను అందిస్తున్నాం’ అని పెమ్మసాని వివరించారు.

Updated Date - Jun 07 , 2025 | 03:29 AM