ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Government School: కార్పొరేట్‌ను తలదన్నేలా..

ABN, Publish Date - Jul 10 , 2025 | 05:05 AM

ఆ పాఠశాల ఆవరణలోకి అడుగుపెట్టగానే కార్పొరేట్‌ స్కూలు కన్నా మిన్నగా కనిపిస్తుంది. విద్యార్థులందరూ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థిమిత్ర కిట్లు ద్వారా అందించిన యూనిఫామ్‌, షూ ధరించే ఉంటారు.

  • కాకినాడ జిల్లాలో ఆకట్టుకుంటున్న ప్రభుత్వ పాఠశాల

  • అత్యాధునిక సైన్స్‌ ల్యాబ్‌ ప్రత్యేకం

  • ఆంగ్ల భాషలో విద్యార్థుల ప్రావీణ్యం

  • ఆహ్లాదకర వాతావరణంలో విద్యాబోధన

(పిఠాపురం-ఆంధ్రజ్యోతి): ఆ పాఠశాల ఆవరణలోకి అడుగుపెట్టగానే కార్పొరేట్‌ స్కూలు కన్నా మిన్నగా కనిపిస్తుంది. విద్యార్థులందరూ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థిమిత్ర కిట్లు ద్వారా అందించిన యూనిఫామ్‌, షూ ధరించే ఉంటారు. బ్యాగు, మెడలో ఐడెంటిటీ కార్డుతో స్కూలుకు వస్తారు. ఆంగ్ల భాషలో ప్రావీణ్యం చూపిస్తున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన సైన్స్‌ ల్యాబ్‌, లైబ్రరీ ఈ పాఠశాల ప్రత్యేకం. ఆహ్లాదకర వాతావరణంతో ఆకట్టుకుంటున్న ఆ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పి.దొంతమూరులో ఉంది. పూర్తిగా ఇంగ్లిషు మీడియంలో విద్యా బోధన సాగే ఈ పాఠశాలలో 286 మంది విద్యార్థులు, 14 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రభుత్వం అందించిన ప్రతి సౌకర్యాన్నీ ఇక్కడ ప్రధానోపాధ్యాయుడు వీవీ రెడ్డి సారథ్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రభుత్వం సైన్స్‌ ల్యాబ్‌కు అవసరమైన పరికరాలను అందించింది. ల్యాబ్‌కు ప్రత్యేకంగా ఒక గది కేటాయించి అత్యాధునికంగా తీర్చిదిద్దారు. పవన్‌కల్యాణ్‌ అందించిన స్పోర్ట్స్‌ కిట్లతో క్రీడల్లోనూ విద్యార్థులు రాణిస్తున్నారు. గతం కంటే పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగింది.

Updated Date - Jul 10 , 2025 | 05:05 AM