AP High Court: చట్టం బైలా అనుమతిస్తేనే నామినేటెడ్ సభ్యుల తొలగింపు
ABN, Publish Date - Jun 01 , 2025 | 04:21 AM
నామినేటెడ్ సభ్యులను పదవీ కాలం ముగించకముందే రాజీనామా చేయమని కోరడం లేదా తొలగించడం ప్రభుత్వానికి చట్టపరంగా సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేస్తూ పలువురు కలెక్టర్లు ఇచ్చిన తొలగింపు ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం అమాన్యం చేసింది.
పశుగణాభివృద్ధి సంఘం వ్యవహారంలో హైకోర్టు స్పష్టీకరణ
అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): ఏదైనా చట్టం, బైలా అనుమతి ఉంటేనే నామినేటెడ్ సభ్యుల రాజీనామా కోరడం లేదా వారిని పదవుల నుంచి తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. జిల్లా పశుగణాభివృద్ధి సంఘం పాలకవర్గంలో నామినేటెడ్ సభ్యుల పదవీకాలం ముగియకముందే రాజీనామా చేయాలని కోరడం, పదవుల నుంచి తొలగించడాన్ని తప్పుబట్టింది. వారిని తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. అలాగే పిటిషనర్లను సభ్యులుగా తొలగిస్తూ ప్రకాశం, విజయనగరం, చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల కలెక్టర్లు ఇచ్చిన ఉత్తర్వులను కూడా రద్దు చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
ఇవి కూడా చదవండి
శ్రీకాంత్ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు
కలెక్టరేట్‌లో కరోనా.. ఐసోలేషన్‌కు ఉద్యోగులు
Read Latest AP News And Telugu News
Updated Date - Jun 01 , 2025 | 04:21 AM