ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Amaravati: రాజధానిలోకి మరో నాలుగు గ్రామాలు

ABN, Publish Date - May 09 , 2025 | 05:16 AM

అమరావతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి ఎన్టీఆర్ జిల్లాలోని త్రిలోచనాపురం, మూలపాడు, కొటికలపూడి, జమీమాచవరం గ్రామాలను రాజధాని పరిధిలోకి తీసుకువచ్చేందుకు నిర్ణయించగా, గ్రామసభల్లో రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించారు

ఎన్టీఆర్‌ జిల్లా నుంచి ఎంపిక.. స్పోర్ట్స్‌ సిటీ కోసం నిర్ణయం

భూములివ్వడానికి రైతుల ఆమోదం

విజయవాడ, మే 8 (ఆంధ్రజ్యోతి): అమరావతిలో స్పోర్ట్స్‌ సిటీ నిర్మాణం కోసం వేగంగా అడుగులు పడుతున్నాయి. కృష్ణానదిని ఆనుకుని ఎన్టీఆర్‌ జిల్లాలో ఉన్న నాలుగు గ్రామాలను రాజధాని పరిధిలోకి తీసుకువచ్చేందుకు నిర్ణయించారు. ఇబ్రహీంపట్నం మండలంలోని త్రిలోచనాపురం, మూలపాడు, కొటికలపూడి, జమీమాచవరం గ్రామాలను ఎంపిక చేశారు. ఈ గ్రామాల పరిధిలో భూములను భూ సమీకరణ విధానంలో తీసుకునేందుకు వీలుగా గురువారం గ్రామసభలను నిర్వహించారు. నాలుగు గ్రామాల్లోని గ్రామసభల్లో రైతులు భూములు ఇవ్వటానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. స్పోర్ట్స్‌ సిటీ కోసం ఇంతకుముందు కృష్ణానదిలో ఉన్న చినలంక, పెదలంక దీవులను పరిశీలించారు. ఇవి వరదకు మునిగిపోయే అవకాశం ఉండటంతో వాటిని వద్దనుకున్నారు. వీటికి సమీపంలోనే ఉన్న నాలుగు గ్రామాలను ఎంపిక చేశారు.


మూలపాడులో ఇప్పటికే రెండు క్రికెట్‌ స్టేడియాలు ఉన్నాయి. ఈ ప్రాంతం స్పోర్ట్స్‌ సిటీకి అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. మూలపాడు నుంచే అమరావతికి గ్రాండ్‌ ఎంట్రన్స్‌వే ఏర్పాటు చేయాలని, కృష్ణానది మీదుగా ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్న నేపథ్యంలో ఈ నాలుగు గ్రామాలను ఎంచుకున్నట్లు సమాచారం. మూలపాడులోనే అంతర్జాతీయ క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా ఉన్నట్టుగా తెలిసింది.

Updated Date - May 09 , 2025 | 05:16 AM