Tungabhadra Dam: తుంగభద్ర క్రస్ట్‌గేట్‌ల తయారీకి బిడ్‌లు
ABN, Publish Date - May 31 , 2025 | 04:44 AM
తుంగభద్ర డ్యాం క్రస్ట్ గేట్ల తయారీకి నాలుగు కంపెనీలు బిడ్‌లు ఇచ్చినప్పటికీ, వాటి అనుభవం, అర్హతపై జూన్ 4 లేదా 5న అధికారులు నిర్ణయం తీసుకుంటారు. ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా 19వ గేటు పనులు పూర్తవకపోవచ్చని చెప్పారు.
ఈ-టెండరులో పాల్గొన్న 4 కంపెనీలు
బళ్లారి, మే 30(ఆంధ్రజ్యోతి): తుంగభద్ర డ్యాం క్రస్ట్ గేట్ల తయారీకి ఈ-టెండర్‌లో నాలుగు కంపెనీలు బిడ్‌లు వేశాయి. పనులు చేసేందుకు వీటికి అర్హత ఉందా లేదా అన్న విషయాన్ని జూన్ 4, లేదా ఐదో తేదీన అధికారులు నిర్ధారించనున్నారు. ఇంతకు మునుపు ఈ-టెండర్‌లో బిడ్ వేసిన కంపెనీల్లో మూడింటికి అనుభవం లేదని, మరో కంపెనీ తన అనుభవాన్ని పొందుపరలేదని వాటిని తిరస్కరించారు. కాగా, డ్యాంకు మొత్తం 33 క్రస్ట్ గేట్లు ఉండగా, 19వ క్రస్ట్‌గేట్ మినహా 32 క్రస్ట్‌గేట్‌ల ఏర్పాటుకు రూ.60 కోట్లతో టెండర్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. 19వ క్రస్ట్‌గేటు ఏర్పాటు పనులను గుజరాత్‌కు చెందిన ఓ కంపెనీకి అప్పగించారు. ప్రస్తుతం పచ్చిమ కనుమల్లో వర్షాలు బాగా కురుస్తున్నాయి. డ్యాంకు వరద మొదలైంది. 1000 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఈ కారణంగా ఈ ఏడాది 19వ గేటు ఏర్పాటు కూడా సాధ్యం కాకపోవచ్చని అధికారులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి
ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
ఫేస్‌బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు
Read Latest AP News And Telugu News
Updated Date - May 31 , 2025 | 04:44 AM