Former Cricketer Nagraju : కోడెలపై తప్పుడు కేసు పెట్టా
ABN, Publish Date - Mar 09 , 2025 | 04:24 AM
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, నరసరావుపేట వైసీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఒత్తిడి చేసి తనతో మాజీ స్పీకర్
విజయసాయి, గోపిరెడ్డి ఒత్తిడితోనే చేశా
ఆంధ్ర రంజీ మాజీ క్రికెటర్ నాగరాజు
నరసరావుపేట లీగల్, మార్చి 8(ఆంధ్రజ్యోతి): వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, నరసరావుపేట వైసీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఒత్తిడి చేసి తనతో మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు డాక్టర్ కోడెల శివరామ్‌లపై తప్పుడు కేసు పెట్టించారని ఆంధ్ర రంజీ మాజీ క్రికెటర్ నాగరాజు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా పొలాకి మండలం ఏవ్వారిపేట గ్రామానికి చెందిన ఆయన ఈ కేసును కోర్టులో రాజీమార్గం ద్వారా పరిష్కరించుకున్నారు. అనంతరం కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడారు.
2019లో కోడెల శివప్రసాదరావు, కోడెల శివరామ్‌లు తన వద్ద నుంచి 15 లక్షల రూపాయలు లంచం తీసుకున్నట్లు కేసు పెట్టాలని వైసీపీ నేతలు తీవ్రంగా ఒత్తిడి తెచ్చారన్నారు. కేసు పెట్టకపోతే రంజీ క్రికెట్ టీమ్‌లో ఆడే అవకాశం తనకు కల్పించబోమని ఆనాడు విజయసాయిరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి బెదిరించారని తెలిపారు. దీంతో తాను భయపడి తప్పుడు కేసు పెట్టానని వెల్లడించారు. తాను కోడెల కుటుంబంపై చేసిన ఫిర్యాదులో ఎలాంటి వాస్తవం లేదన్నారు.
Updated Date - Mar 09 , 2025 | 04:24 AM