ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu Naidu: సుపరిపాలనలో తొలి అడుగు

ABN, Publish Date - Jun 23 , 2025 | 06:02 AM

అధికారంలోకి వచ్చి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరిట రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది.

  • ఏడాది పనితీరుపై నేడు ప్రత్యేక సమావేశం

  • మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌వోడీలు హాజరు

  • ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు కూడా

  • భేటీ ముగిశాక రాత్రికి విందు

  • అమరావతిలో సాయంత్రం 4 గంటలకు మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌వోడీలు హాజరు.

  • ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు కూడా.. భేటీ ముగిశాక విందు

అమరావతి, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): అధికారంలోకి వచ్చి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరిట రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు రాజధాని అమరావతిలో.. వెలగపూడి సచివాలయం వెనుకభాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఈ కార్యక్రమం జరుగనుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడచినందున జూన్‌ 12వ తేదీనే ఈ భేటీ నిర్వహించాలని భావించినా.. అహ్మదాబాద్‌ సమీపంలో జరిగిన ఘోర విమాన ప్రమాదం దృష్ట్యా వాయిదా వేశారు. సోమవారం నాటి ప్రత్యేక సమావేశంలో.. గడచిన ఏడాదిలో చేపట్టిన పాలనా సంస్కరణలు, తీసుకొచ్చిన మార్పులు, అందించిన సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి చేసిన కృషిని సమీక్షించనున్నారు. వచ్చే నాలుగేళ్లలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడటంతో పాటు అభివృద్ధి లక్ష్యాలను ఎలా సాధించాలన్న అంశంపై ప్రధానంగా దృష్టి పెడతారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరవుతారు.

స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలపైనా..

కూటమి ప్రభుత్వం రెండో ఏడాదిలోకి అడుగుపెట్టింది. జగన్‌ హయాం లో జరిగిన ఆర్థిక, పాలనా విధ్వంసాలను సరిదిద్దుతూ.. రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా నడుస్తోంది. స్వల్పకాలిక అభివృద్ధి లక్ష్యాలతో పాటు స్వర్ణాంధ్ర విజన్‌-2047లాంటి దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణం, పరిశ్రమలు-పెట్టుబడులను తీసుకురావడం, 20లక్షల మందికి ఉద్యోగావకాశాల కల్పన తదిర అంశాల్లో వేగంగా అడుగులు వేస్తోంది. ఏడాదిలో చేసిన సుపరిపాలనను సమీక్షించుకుంటూ.. రాష్ట్ర భవిష్యత్‌ కోసం రూపొందించిన ప్రణాళికలను సోమవారంనాటి భేటీలో విశదీకరిస్తారు. ఇదే సమయంలో రెండో ఏడాదిలో ఏం చేయాలి.. ఎలాంటి కార్యక్రమాలు, లక్ష్యాలను చేపట్టాలో చర్చిస్తారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో పాటు 26 జిల్లాల నుంచి వచ్చే అధికారులతో సమావేశం ముగిసిన తర్వాత అందరితో కలిసి సీఎం రాత్రికి అక్కడే విందులో పాల్గొంటారు.

Updated Date - Jun 23 , 2025 | 06:03 AM