ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nadendla Manohar: సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం

ABN, Publish Date - Jun 10 , 2025 | 04:26 AM

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 12 నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు సన్నబియ్యంతో ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు.

  • ఈ నెల 12 నుంచి అమలు: నాదెండ్ల

ఏలూరు, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 12 నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు సన్నబియ్యంతో ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. 41 వేల ప్రభుత్వ పాఠశాలలు, 4వేల సంక్షేమ హాస్టళ్లలో సన్న బియ్యంతో భోజనం పెట్టనున్నట్టు తెలిపారు. సోమవారం ఆయన ఏలూరులోని 74వ రేషన్‌ డిపోను, సుబ్బమ్మదేవి హైస్కూల్‌ను జేసీ ధాత్రిరెడ్డితో కలిసి తనిఖీ చేశారు. పాఠశాలకు సరఫరా చేసిన 25 కేజీల బియ్యం బస్తా, రాగి పిండి, బెల్లం పొడి ప్యాకెట్లను పరిశీలించారు. కొత్త రేషన్‌ విధానం అమలు, బియ్యం నాణ్యతపై స్థానిక మహిళ డి.వెంకటలక్ష్మి నుంచి అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల 75 వేలు కుటుంబాలకు రేషన్‌ అందించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 12 లక్షల 46 వేల కుటుంబాలకు సరఫరా చేశామని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ జోన్‌ ఆర్టీసీ రీజనల్‌ చైర్మన్‌ రెడ్డి అప్పలనాయడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2025 | 04:27 AM