ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Fire Accident: దివాన్ చెరువు ఫారెస్ట్ లో భారీ అగ్ని ప్రమాదం

ABN, Publish Date - Feb 04 , 2025 | 05:43 PM

Fire Accident: రాజమండ్రి సమీపంలోని దివాన్ చెరువు వద్దనున్న అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బందితోపాటు అటవీ శాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

రాజమండ్రి, ఫిబ్రవరి 04: రాజమండ్రి దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాజమండ్రి నుంచి రాజానగరం వెళ్లే జాతీయ రహదారి పక్కన మంటలు భారీగా వ్యాపించాయి. దీంతో అటవీ ప్రాంతంలో పొగ భారీగా వ్యాపించింది. చక్రద్వారా బంధం గ్రామ సమీపంలో మంటలు వ్యాపించాయి. దాంతో గ్రామస్తులతోపాటు రైతులు తీవ్ర భయాందోళను చెందుతోన్నారు. ఈ అగ్నిప్రమాదంపై అగ్నిమాపక సిబ్బందితోపాటు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

Also Read: ఆ ఉచ్చులో పడకండి.. సీఎం చంద్రబాబుకు కీలక సూచన

అటవీ శాఖ అధికారులతోపాటు అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తు్న్నారు. అయితే ఈ రిజర్వ్ ఫారెస్ట్ అంతా జామాయిల్ తోటలతో నిండి ఉంటుందని స్థానికులు వెల్లడించారు. ఇక్కడ వందలాది ఎకరాల్లో రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు అయితే తెలియరాలేదు.

Also Read: కేజ్రీవాల్ ఆరోపణలు.. స్పందించిన ఈసీ

ఈ అగ్ని ప్రమాదానికి వెనుక ఏదైనా కారణం ఉందా? ఇది ఎవరైనా కావాలని చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదీకాక ఇటీవల ఎండలు గట్టిగా కాస్తున్నాయి. రాత్రి పూట ఎంత చలిగా ఉంటుందో.. ఉదయం.. మధ్యాహ్నం వేళ.. అంతే ఎండతో వేడిగా ఉంటుంది. ఆ కారణంతో ఈ అగ్ని ప్రమాదం జరిగిందా అనే కోణంలో.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

For AndhraPradesh news And Telugu News

Updated Date - Feb 04 , 2025 | 05:45 PM