ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Eluru Fire Incident: మంటలు పుట్టించారు

ABN, Publish Date - Jun 11 , 2025 | 04:41 AM

అసత్యాలు, అర్ధసత్యాలు, వక్రీకరణలతో వైసీపీ రాజకీయం! దానికి తోడు... జగన్‌ రోత మీడియా ప్రచారం! మంగళవారం ఏలూరులో జరిగిన ఘటన ఈ వికృత రూపాన్ని మరోసారి బయటపెట్టింది.

  • అగ్ని ప్రమాదంపై తప్పుడు ప్రచారం

  • ఏలూరులో గోడౌన్‌లో మంటలు

  • పైఅంతస్తులో ఉన్న ‘సాక్షి’ ఆఫీసు

  • ఆందోళనకారులు నిప్పంటించారని దుష్ప్రచారం.. ఖండించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది

ఏలూరు రూరల్‌/క్రైమ్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): అసత్యాలు, అర్ధసత్యాలు, వక్రీకరణలతో వైసీపీ రాజకీయం! దానికి తోడు... జగన్‌ రోత మీడియా ప్రచారం! మంగళవారం ఏలూరులో జరిగిన ఘటన ఈ వికృత రూపాన్ని మరోసారి బయటపెట్టింది. ఫర్నిచర్‌ గోడౌన్‌లో మంటలు చెలరేగగా... ‘సాక్షి’ కార్యాలయానికి టీడీపీ నేతలు నిప్పు పెట్టారంటూ అటు వైసీపీ సోషల్‌ మీడియాలో, సాక్షి వెబ్‌సైట్‌లో తప్పుడు ప్రచారం చేశారు. అదే భవనంలో ఒక భాగంలో ‘సాక్షి’ స్థానిక కార్యాలయం ఉండటం నిజం! ‘అమరావతి వేశ్యల రాజధాని’ అంటూ ‘సాక్షి’ చానల్‌లో చేసిన రోత వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ కార్యకర్తలు, నేతలు ఆందోళనకు దిగిన మాటా నిజం! కానీ... వీరి ర్యాలీ సాక్షి కార్యాలయానికి 200 మీటర్ల దూరంలో ఉండగానే అక్కడ మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదానికీ, టీడీపీ ర్యాలీకి ఎలాంటి సంబంధంలేదని పోలీసులూ ధ్రువీకరించారు. అయినా సరే... విష ప్రచారం మాత్రం ఆగలేదు. అసలేం జరిగిందంటే...

భారీ నిరసనగా

దెందులూరు నియోజకవర్గానికి చెందిన వందలాది మంది మహిళలు ఏలూరు పాత బస్టాండ్‌ దగ్గర నుంచి ర్యాలీగా ఎన్‌ఆర్‌పేటలోని సాక్షి కార్యాలయానికి బయలుదేరారు. ఒక భవనంలోని రెండు పోర్షన్లలో ఒక దానిలో భవన యజమానురాలు నివసిస్తున్నారు. మరో పోర్షన్‌ను ఫర్నిచర్‌ షాపు యజమాని అద్దెకు తీసుకుని... రిపేరు గోడౌన్‌గా వినియోగిస్తున్నారు. ఇదే భవనం మొదటి అంతస్తులోని ఒక పోర్షన్‌లో సాక్షి కార్యాలయం ఉంది. మరో పోర్షన్‌నుఉపాధ్యాయ సంఘాలు సమావేశ కార్యాలయంగా వినియోగించుకుంటున్నాయి.. ‘సాక్షి’ కార్యాలయం వద్దకు టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసనగా వస్తున్న నేపథ్యంలో... ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్‌కుమార్‌ పర్యవేక్షణలో ముగ్గురు సీఐలు, 20 మంది పోలీస్‌ సిబ్బందిని అక్కడ బందోబస్తుగా పెట్టారు. నిరసన ప్రదర్శన మరో 200 కిలోమీటర్ల దూరంలో ఉండగానే ఫర్నిచర్‌ గోడౌన్‌ వరండాలో... మరమ్మతుకు వచ్చిన సోఫాకు మంటలు అంటుకున్నాయి. ఆ పక్కనే ఉన్న కుర్చీలు కూడా దగ్ధమయ్యాయి. పోలీసులు వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు. అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని... మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా నీళ్లు చిమ్మారు. ఇదీ అక్కడ జరిగింది.

నిప్పంటించారంటూ...

ఫర్నిచర్‌ గోడౌన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై ‘సాక్షి’ మీడియా, సోషల్‌ మీడియా వక్రీకరించింది. తమ కార్యాలయాన్ని దహనం చేశారంటూ, సిబ్బందిని నిర్బంధించి కార్యాలయంలో పెట్రోలు పోసి తగలపెట్టారని ప్రచారం మొదలుపెట్టారు. దీంతో... మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్‌, త్రీ టౌన్‌ సీఐ కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ‘‘అగ్ని ప్రమాద ఘటనకు, సాక్షి కార్యాలయానికీ సంబంధం లేదు. మంటలు చెలరేగే సమయానికి... టీడీపీ నిరసన ప్రదర్శన అక్కడికి 200 మీటర్ల దూరంలో ఉంది. మంటలు ఆర్పుతున్న సమయానికి దెందులూరు మహిళలు ర్యాలీగా అక్కడికి చేరుకున్నారు. సాక్షి కార్యాలయంపై దాడి, దహనం అని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు’’ అని డీఎస్పీ స్పష్టం చేశారు. ఫర్నిచర్‌ షాపు యజమాని ఉంగరాల శ్రీనివాసరావు కూడా ఇదే విషయం తెలిపారు. తన గోడౌన్‌లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయని చెప్పారు. అక్కడ రసాయనాలు ఉపయోగించి మంటలు సృష్టించినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని జిల్లా అదనపు అగ్నిమాపక శాఖ అధికారి రామకృష్ణ స్పష్టం చేశారు. తాము వెళ్లేటప్పటికే పోలీసులు మంటలను ఆర్పివేశారన్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ లేదా ఇతర కారణాల వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చునని స్పష్టం చేశారు.

Updated Date - Jun 11 , 2025 | 04:44 AM