Dr Prabhavati: తెలియదు.. గుర్తులేదు
ABN, First Publish Date - 2025-04-08T04:18:50+05:30
రఘురామ కస్టడీ చిత్రహింసల కేసులో విచారణకు హాజరైన డాక్టర్ ప్రభావతి, ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకుండా "తెలియదు, గుర్తులేదు" అంటూ దాటవేత ధోరణి చూపినట్లు తెలుస్తోంది. గాయాల నివేదికలో మార్పులపై ఒత్తిడి ఎవరి నుండి వచ్చిందన్న ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వలేదని సమాచారం.
రఘురామ కేసులో డాక్టర్ ప్రభావతి జవాబులు
ఒంగోలులో ప్రకాశం ఎస్పీ ఎదుట హాజరు
ఉదయం నుంచి రాత్రి 9 వరకు విచారణ
సహకరించని జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్!
ఒంగోలు క్రైం, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): తెలియదు.. గుర్తులేదు అంటూ డాక్టర్ ప్రభావతి విచారణకు సహకరించకుండా దాటవేత ధోరణిని ప్రదర్శించినట్లు తెలిసింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి సుప్రీంకోర్టు ఆదేశాలతో సోమవారం విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు ఒంగోలులోని ప్రకాశం జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చారు. రాత్రి 9 గంటల వరకు విచారణ సాగింది. రఘురామ శరీరంపై గాయాలకు సంబంధించి వైద్యులు ఇచ్చిన నివేదికలను ఎందుకు తారుమారు చేశారు.. మీపై ఎవరు ఒత్తిడి చేశారని ఎస్పీ దామోదర్ అడిగినట్లు తెలిసింది. మొత్తం 40 ప్రశ్నలు సంధించగా.. తెలియదు, గుర్తులేదంటూ దాటవేత ధోరణితో ఆమె జవాబులిచ్చినట్లు సమాచారం. మంగళవారం కూడా విచారణ కొనసాగనుంది.
ఇవి కూడా చదవండి..
TGSRTC: ఎండీకి నోటీసులు.. మోగనున్న సమ్మె సైరన్
Vaniya Agarwal: మైక్రోసాఫ్ట్‌ను అల్లాడించిన వానియా అగర్వాల్ ఎవరు
Rains: ఓరి నాయనా.. ఎండలు మండుతుంటే.. ఈ వర్షాలు ఏందిరా
Student: వారం పాటు.. వారణాసిలో దారుణం..
Mamata Banerjee: హామీ ఇస్తున్నా.. జైలుకెళ్లేందు సిద్ధం..
Nara Lokesh: ‘సారీ గయ్స్..హెల్ప్ చేయలేకపోతున్నా’: మంత్రి లోకేశ్
LPG Price Hiked: పెరిగిన సిలిండర్ ధర.. ఎంతంటే..
Updated Date - 2025-04-08T04:18:51+05:30 IST