ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Excise Dept : పైవాళ్లకివ్వాలి.. పదివేలు ఇవ్వండి

ABN, Publish Date - Feb 05 , 2025 | 04:49 AM

రాష్ట్రవ్యాప్తంగా 3,396 మద్యం షాపులుండగా రూ.3.3 కోట్ల వసూళ్లు లక్ష్యంగా పెట్టుకున్నారు.

  • ప్రతి మద్యం షాపు నుంచి మామూళ్లు

  • ఎక్సైజ్‌ కమిషనరేట్‌లోనే లంచాల పర్వం

అమరావతి, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): ‘పైస్థాయిలో ఇవ్వాలి. ప్రతి మద్యం షాపు లైసెన్సీ రూ. 10 వేలు ఇవ్వండి’ అంటూ ఎక్సైజ్‌ కమిషనరేట్‌లోనే వసూళ్ల పర్వానికి తెరతీశారు. రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చిన నేపథ్యంలో ఓ అధికారి ద్వారా ఈ వసూళ్లను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,396 మద్యం షాపులుండగా రూ.3.3 కోట్ల వసూళ్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే రూ.2 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం ఇటీవల ఉన్నతాధికారుల దృష్టికి కూడా వచ్చింది. కమిషనరేట్‌ పేరుతో వసూళ్లు చేస్తున్నట్లు వారు గుర్తించారు. దీనిపై ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ నిషాంత్‌కుమార్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ రాహుల్‌దేవ్‌ శర్మ ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి జిల్లాల అధికారులకు వార్నింగ్‌ ఇచ్చారు. కమిషనరేట్‌లోని ఓ అధికారి ఈ వసూళ్ల పర్వాన్ని ఎలా చేపట్టారనే దానిపై కూడా అనుమానాలు ఉన్నాయి. జిల్లాల్లో వసూళ్లకు పాల్పడితే అవి కమిషనరేట్‌ దృష్టికి రావు. కానీ స్వయంగా కమిషనరేట్‌ నుంచే వసూళ్ల వ్యవహారం కొనసాగితే ఇంతకాలం ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు వెళ్లలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇదంతా జిల్లాల అధికారుల పని అని, కమిషనరేట్‌కు సంబంధం లేదని చెప్పే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. కమిషనరేట్‌ అధికారులను కాపాడేందుకు ఈ వసూళ్ల వ్యవహారాన్ని జిల్లాల అధికారులపైకి నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలోనూ ఎక్సైజ్‌లో వసూళ్ల వ్యవహారాలు కనిపించేవి. అయితే అవి జిల్లా స్థాయిలకే పరిమితం అయ్యేవి. ఎక్సైజ్‌ స్టేషన్ల వారీగా చేసిన వసూళ్లు జిల్లా స్థాయి, ఆ పైస్థాయికి చేరేవి. ఇందులో కమిషనరేట్‌ అధికారులు, ఉద్యోగులు జోక్యం చేసుకునేవారు కాదు. కానీ ఇప్పుడు నేరుగా కమిషనరేట్‌ నుంచి వసూళ్లకు దిగారు. దీనిని చూసి జిల్లాల అధికారులు కూడా అవాక్కయ్యారు.


మా దృష్టికి వచ్చింది: నిషాంత్‌కుమార్‌

దీనిపై ఎక్సైజ్‌ డైరెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ను వివరణ కోరగా ఆయన స్పందించారు. ‘‘సంక్రాంతి పండగ సమయంలో ఈ విషయం మా దృష్టికి వచ్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌తో కలిసి వెంటనే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేశాం. కమిషనరేట్‌లో ఇవ్వాలని చెప్పి వసూళ్లు చేస్తున్నట్లు తెలిసింది. ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లినప్పుడు ఈ విషయంపై సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చాం. త్వరలో మరికొన్ని జిల్లాల్లోనూ పర్యటించి దీనిపై చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం

శ్రీకాకుళం పట్టణానికి కొత్త శోభ: రామ్మోహన్ నాయుడు

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 05 , 2025 | 04:49 AM