APNGOs Venkata Shiva Reddy: వైసీపీ పాలనలో ఉద్యోగుల జీవితాలు నాశనం
ABN, Publish Date - Apr 17 , 2025 | 05:46 AM
వైసీపీ పాలనలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్రంగా నష్టపోయారని ఏపీఎన్‌జీజీఓ అధ్యక్షుడు వెంకట శివారెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులకు న్యాయం జరిగిందని తెలిపారు
కూటమి ప్రభుత్వంలో ఊరట: వెంకట శివారెడ్డి
అనంతపురం(ప్రెస్‌క్లబ్), ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో ఉద్యోగుల జీవితాలు నాశనమయ్యాయని ఏపీఎన్‌జీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట శివారెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు ఊరట లభిస్తోందని తెలిపారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని ఎన్‌జీఓ హోంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ హయాంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. బకాయిలు చెల్లించాలని రోడ్లెక్కి నినదిస్తే, సమస్యలను పరిష్కరించకపోగా తమపైనే 3,600 అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చాక రూ.1500 కోట్లు పాత బకాయిలు చెల్లించి అండగా నిలిచిందని తెలిపారు. ఉద్యోగులపై పెట్టిన 3,600 అక్రమ కేసులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డీజీపీకి ఆదేశాలు జారీ చేశారని చెప్పారు.
Updated Date - Apr 17 , 2025 | 05:46 AM