ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Lorry Accident: ప్రమాదాన్ని ఆపేందుకు వెళ్లి..

ABN, Publish Date - Jun 04 , 2025 | 07:21 AM

కొవ్వూరు మండలంలో జరిగిన రాత్రి లారీ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు ప్రాణాలు కోల్పొన్నారు. లారీ డ్రైవర్ ప్రమాదానికి గురై రోడ్డుపై నిలబడి వెనుక వాహనాలకు సిగ్నల్ ఇచ్చిన సమయంలో ఐషర్ వ్యాన్ అతన్ని ఢీకొట్టి భారీ ప్రమాదం జరిగింది.

  • గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొని రోడ్డుపై ఆగిన లారీ

  • వెనుక వాహనాలకు సిగ్నల్‌ ఇస్తూ రోడ్డుపైకొచ్చిన డ్రైవర్‌

  • చీకటిలో వేగంగా వచ్చి ఢీకొట్టిన ఐషర్‌ వ్యాన్‌

  • లారీ డ్రైవర్‌, ఐషర్‌ డ్రైవర్‌ ఇద్దరూ మృతి

కొవ్వూరు, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): ఒక డ్రైవర్‌ మంచి మనసు అతని ప్రాణాలే తీసింది. ఆయన నడుపుతున్న లారీకి ప్రమాదం జరిగి రోడ్డు పక్కన ఆగిపోయింది. చీకట్లో ఆ లారీని మరేదైనా వాహనం ఢీకొడితే మరింత ప్రమాదమని గుర్తించిన డ్రైవర్‌... రోడ్డు పక్కన నిలబడి వాహనాలకు సిగ్నల్‌ ఇస్తున్నాడు. తెల్లవారుజాము కావడంతో అటుగా వస్తున్న ఐషర్‌ వ్యాన్‌ ఆ డ్రైవర్‌ను ఢీకొని వెళ్లి.. ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో డ్రైవర్లిద్దరూ ప్రాణాలు కోల్పోయాడు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరం ఎక్స్‌ప్రెస్‌ హైవేపై మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం తల్లా వెళ్ళమల గ్రామానికి చెందిన లారీడ్రైవర్‌ బత్తుల శ్రీనయ్య (40) హైదరాబాద్‌ నుంచి దాన్యం లోడ్‌తో మండపేట బయలుదేరాడు. కొవ్వూరు మండలం కాపవరం వచ్చేసరికి మంగళవారం తెల్లవారుజామున నిద్రమత్తులో ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో ఆ లారీ కుడి పక్క డివైడర్‌ను ఢీకొని ఆగిపోయింది. అయితే వెనుక వచ్చే వాహనాలు చీకట్లో కనిపించిక లారీని ఢీకొట్టకుండా ఉండేందుకు శ్రీనయ్య తన లారీ వెనుక నిలబడి ట్రాఫిక్‌ డైరెక్షన్స్‌ ఇస్తున్నాడు. అదే సమయంలో జంగారెడ్డిగూడెం నుంచి ధాన్యం లోడ్‌తో వస్తున్న ఐషర్‌ వ్యాన్‌.. శ్రీనయ్యను ఢీకొట్టింది. ఆ వెంటనే లారీ వెనుక భాగాన్ని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీడ్రైవర్‌ బత్తుల శ్రీనయ్య, కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడికి చెందిన ఐషర్‌ డ్రైవర్‌ కొయ్యా బాబూరావు (40) కేబిన్‌లో చిక్కుకుని మృతి చెందారు.

Updated Date - Jun 04 , 2025 | 07:21 AM