DGP Appointment: నేడు డీజీపీ ప్యానెల్ సమావేశం
ABN, Publish Date - Apr 30 , 2025 | 05:59 AM
రాష్ట్ర డీజీపీ పదవి భర్తీకి సంబంధించి ఢిల్లీలో నేడు ప్యానెల్ సమావేశం జరుగనుంది. హరీశ్‌కుమార్ గుప్తా పూర్తిస్థాయి డీజీపీగా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం
ఢిల్లీ వెళ్తున్న సీఎస్ విజయానంద్
5 పేర్లతో జాబితా పంపిన రాష్ట్ర ప్రభుత్వం
ప్రస్తుత డీజీపీ గుప్తాకే అవకాశం!
అమరావతి, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ని కేంద్రం ఖరారు చేయనుంది. బుధవారం ఢిల్లీలో రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోం శాఖ కార్యదర్శి, యూపీఎస్సీ ప్రతినిధితో కూడిన కమిటీ.. డీజీపీ పదవి కోసం ప్రభుత్వం పంపిన ప్యానెల్ జాబితాను పరిశీలించి నిర్ణయం తీసుకోనుంది. ఇందుకోసం సీఎస్ కె.విజయానంద్ బుధవారం ఢిల్లీ వెళ్తున్నారు. ప్రస్తుతం హరీశ్‌కుమార్ గుప్తా డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం పంపిన జాబితాలో ఆయనతో పాటు సీనియర్ ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, మాదిరెడ్డి ప్రతాప్, కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, అమిత్ గార్గ్ ఉన్నారు. కమిటీ వీరిలో మూడు పేర్లను రాష్ట్రప్రభుత్వానికి పంపుతుంది. ఆ ముగ్గురిలో ఒకరిని ప్రభుత్వం ఖరారు చేస్తుంది. గుప్తానే పూర్తిస్థాయి డీజీపీగా ఎంపిక చేసే అవకాశాలు ఎక్కుగా ఉన్నాయని అంటున్నారు. అదే జరిగితే ఆయన రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారు.
Updated Date - Apr 30 , 2025 | 05:59 AM