Tirumala Security: తిరుమలకు మరింత మెరుగైన భద్రత
ABN, Publish Date - May 31 , 2025 | 04:52 AM
తిరుమలలో భద్రతను మరింత బలోపేతం చేయాలని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా సూచించారు. యాంటీ డ్రోన్ టెక్నాలజీతో పాటు సైబర్ భద్రతా వ్యవస్థను అభివృద్ధి చేయాలనే అంశాలపై సమీక్ష జరిపారు.
అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేలా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీం
భద్రతా సమీక్షలో డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా
తిరుమల, మే 30 (ఆంధ్రజ్యోతి): దేశంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తిరుమల ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని మెరుగైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడం చాలా అవసరమని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా అభిప్రాయపడ్డారు. తిరుమల భద్రతపై డీజీపీ, టీటీడీ ఈవో శ్యామలరావు సమక్షంలో శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. తిరుపతి ఎస్పీ, టీటీడీ ఇన్‌చార్జి సీవీఎస్వో హర్షవర్ధనరాజు భద్రతా పరమైన అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీ సూచనలు చేశారు. ఏపీఎస్పీ, డీఏఆర్, ఎస్పీఎఫ్, హోంగార్డు, సివిల్ పోలీసు, టీటీడీ విజిలెన్స్‌తో పాటు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్ ఏర్పాటుపై దృష్టి సారించాలని చెప్పారు. సెక్యూరిటీ ఏజెన్సీలకు స్థిరమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించాలన్నారు. అలిపిరి వద్ద బహుళస్థాయి వాహన తనిఖీ వ్యవస్థ, డిఫెన్స్ ఏజెన్సీలతో కలిసి సెన్సర్ ప్లే సిస్టమ్, ఆధునిక భద్రతా పరికరాలు, సైబర్ భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. గత భద్రతా వైఫల్యాలపై చర్చించారు. గతంలో తాను హోంశాఖ ప్రధాన కార్యదర్శి హోదాలో తిరుమలలో పర్యటించి ప్రతిపాదించిన కొన్ని ముఖ్య అంశాలపై కూడా డీజీపీ సమీక్షించారు. అనంతరం ఈవో మాట్లాడుతూ.. తిరుమలలో సైబర్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందన్నారు.
సమావేశంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ సుధాకరరెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేశ్ చంద్ర లడ్డా, డీఐజీ శేముషి, ఐఎ్‌సడబ్ల్యూ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, డీఎ్‌ఫవో వివేక్ ఆనంద్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. సమావేశానికి ముందు డీజీపీ శ్రీవారిని దర్శించుకున్నారు.
యాంటీ డ్రోన్ టెక్నాలజీ డెమో
తిరుమల క్షేత్రంలో యాంటీ డ్రోన్ టెక్నాలజీని ఏర్పాటు చేయాలనే నిర్ణయంలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, పోలీసులు, విజిలెన్స్ అధికారులకు డెమో ఇచ్చింది. యాంటీ డ్రోన్ టెక్నాలజీ ద్వారా... అనుమానిత డ్రోన్లను ఎలా గుర్తించి, వాటి డైరెక్షన్స్‌ను ఎలా మళ్లించవచ్చో ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు.
ఇవి కూడా చదవండి
ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
ఫేస్‌బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు
Read Latest AP News And Telugu News
Updated Date - May 31 , 2025 | 04:52 AM