ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Prisoner Release : క్షమాభిక్ష.. అందని ద్రాక్ష!

ABN, Publish Date - Jan 26 , 2025 | 03:56 AM

గణతంత్ర దినోత్సవం వచ్చేసినా ఖైదీల విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో ఆయా కుటుంబాల సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

  • ఈసారీ ఖైదీల విడుదల లేనట్టే

  • గణతంత్ర దినోత్సవం వేళ వందల కుటుంబాల్లో నిరాశ

  • సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పట్టించుకోని జగన్‌ ప్రభుత్వం

  • 290 మంది సత్ప్రవర్తన ఖైదీలు ఏళ్ల తరబడి నిరీక్షణలోనే..

  • ఇటీవల విశాఖలో ఐజీ ప్రకటనతో చిగురించిన ఆశలు

  • బీఎన్‌ఎ్‌సఎస్‌ సెక్షన్‌ 475 ప్రకారం అనుమతించని నిబంధనలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘తెలిసో, తెలియకో, క్షణికావేశంలోనో తప్పుచేసి జైలు పాలైన వారిలో సత్ప్రవర్తన కలిగినవారికి త్వరలో విముక్తి లభిస్తుంది’ అంటూ జైళ్లశాఖ ఉన్నతాధికారులు ఇటీవల చేసిన ప్రకటన వందలాది మంది ఖైదీలతో పాటు వారి కుటుంబాల్లోనూ ఆశలు రేకెత్తించింది. అయితే గణతంత్ర దినోత్సవం వచ్చేసినా వారి విడుదలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో ఆయా కుటుంబాల సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఖైదీల విడుదలలో జాప్యంపై హోంశాఖ అధికారులను కర్నూలు జిల్లాకు చెందిన ఒక మహిళా ఎమ్మెల్యే ప్రశ్నించడంతో విషయం వెలుగు చూసింది. జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో సత్ప్రవర్తన కలిగినవారిని జూన్‌ 30లోపు ఒకసారి, డిసెంబరు 31లోపు రెండోసారి జాబితా సిద్ధంచేసి విడుదల చేయాలని సుప్రీంకోర్టు 2021లో మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే గత సీఎం జగన్‌ మాత్రం అవేవీ పట్టించుకోలేదు. సుప్రీంకోర్టుతో ఇబ్బందులు వస్తాయని జైళ్ల శాఖ అధికారులు చెప్పినా పెడచెవిన పెట్టారు. అధికారులు పంపిన జాబితాలో తమవారు లేకపోవడంపై రాయలసీమకు చెందిన అప్పటి మంత్రి ఒకరు అభ్యంతరం పెట్టారు. ‘మన ప్రభుత్వంలో మనోళ్లను బయటికి తెచ్చుకోలేకపోతే ఎలా’గంటూ బహిరంగంగా పెదవి విరిచారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల పరిధిలోకి మీ బంధువులు రాబోరని అధికారులు చెప్పడంతో ‘అయితే ఫైలు పక్కన పెట్టండి’ అంటూ హుకుం జారీ చేశారు. దీంతో అర్హులైన వారిని సైతం విడుదల చేయకుండా వైసీపీ ప్రభుత్వం ఆపేసింది.


అయినా సుప్రీం మార్గదర్శకాల ప్రకారం ఆరు నెలలకు ఒకసారి అర్హుల జాబితాను జైళ్ల శాఖ ప్రభుత్వానికి పంపింది. 2024 జూన్‌ 30 నాటికి ఏ జైలులో, ఏ ఖైదీ అర్హుడో వివరిస్తూ 160 మంది పేర్లతో జాబితాను కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి గత జూలైలో జైళ్లశాఖ పంపింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న వారిని విడుదల చేయవచ్చని ప్రతిపాదనల్లో పేర్కొంది. అయినా ఒక్కరు కూడా విడుదల కాలేదు. గాంధీ జయంతి సందర్భంగా (అక్టోబరు 2న) మరోసారి ప్రభుత్వ పెద్దలకు బాధిత కుటుంబాలు విన్నవించుకోగా 290 మందితో జాబితా సిద్ధం చేసిన జైళ్లశాఖ అధికారులు ఒక్కరినీ విడుదల చేయలేకపోయారు. ఇటీవల విశాఖపట్నం సెంట్రల్‌ జైలులో వివాదం తలెత్తినప్పుడు అక్కడికి వెళ్లిన ఐజీ శ్రీనివాసరావు త్వరలో ఖైదీల విడుదల ఉంటుందని ప్రకటించారు. మరోసారి కూడా నిరాశే ఎదురైంది. ఈ విషయమై హోంశాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. బీఎన్‌ఎ్‌సఎస్‌ అమల్లోకి వచ్చాక నిబంధనలు కఠినతరమయ్యాయని, దానిపై అవగాహన లేకుండా జైళ్లశాఖ అధికారులు మాట్లాడటం ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఉందని వ్యాఖ్యానించారు. గతేడాది అక్టోబరులోనే కేంద్ర న్యాయశాఖకు ప్రతిపాదనలు పంపామన్నారు. బీఎన్‌ఎ్‌సఎస్‌ సెక్షన్‌-475లోని నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పడంతో అర్హుల జాబితా తగ్గిపోయిందని వివరించారు.

నెల రోజుల్లో ఉత్తర్వులు: హోంమంత్రి

ఆరిలోవ(విశాఖపట్నం), జనవరి 25(ఆంధ్రజ్యోతి): జైళ్లలో సత్ప్రవర్తనతో మెలగిన ఖైదీలను గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేయాల్సి ఉందని, అయితే కొన్ని సాంకేతిక కారణాలతో ఆలస్యం అవుతోందని హోంమంత్రి అనిత తెలిపారు. శనివారం విశాఖ నగరంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. మరో నెల రోజుల్లో ఖైదీల క్షమాభిక్షకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడవచ్చని పేర్కొన్నారు. ఖైదీల విడుదలకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. వైసీపీ హయాంలో ఒక్కసారి కూడా క్షమాభిక్షకు చర్యలు తీసుకోలేదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

YS Sharmila: విజయసాయి ఇప్పటికైనా నిజాలు బయటపెట్టు.. షర్మిల చురకలు

విజయసాయి రాజకీయ సన్యాసంపై చంద్రబాబు ఏమన్నారంటే

వివేకానందరెడ్డికి గుండెపోటని ఎందుకు చెప్పానంటే

కూటమి కోసం రాజీనామా.. అసలు విషయం బయటపెట్టిన..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jan 26 , 2025 | 03:57 AM