CPI : లౌకిక వాదానికి బీజేపీ తూట్లు
ABN, Publish Date - Jan 31 , 2025 | 04:54 AM
కేంద్రంలోని అధికార బీజేపీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా దేశ లౌకిక వాదానికి తూట్లు పొడుస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు.
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా
విశాఖపట్నం, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని అధికార బీజేపీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా దేశ లౌకిక వాదానికి తూట్లు పొడుస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు గురువారం విశాఖపట్నం వచ్చిన ఆయన మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గాంధీ అన్ని తరాలకు ఆదర్శనీయుడని, అన్ని మతాలవారిని ఏకతాటిపైకి తెచ్చిన ఘనత ఆయనదన్నారు. గాడ్సేకు బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్ వాదులు పూలదండలు వేస్తున్నారంటే.. గాంధీజీ పట్ల, ప్రజాస్వామ్యం, లౌకికవాదం పట్ల వారికి ఏపాటి గౌరవం ఉందో అర్థమవుతుందని విమర్శించారు. గాంధీ స్ఫూర్తితో ప్రజల హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణకు సీపీఐ పోరాటం చేస్తుందన్నారు. అనంతరం స్థానిక మంత్రీస్ హోటల్‌లో రెండు రోజులపాటు జరిగే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను ప్రారంభించారు. దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితి, సీపీఐ కర్తవ్యం వంటి అంశాలపై ప్రతినిధులకు రాజా వివరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, పలు రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Investments in AP: ఏపీలో భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్.. అత్యధికం ఎక్కడంటే
Maha Kumbh Mela: మీ ఊరి నుంచే కుంభమేళాకు బస్సు.. భక్తుల కోసం బంపర్ ఆఫర్
Tribute.. జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు
AP News: ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ
Read Latest AP News And Telugu News
Updated Date - Jan 31 , 2025 | 04:55 AM