Prosecution : తులసిబాబు కస్టడీ ముగిశాక బెయిల్ పిటిషన్‌పై విచారించండి
ABN, Publish Date - Jan 28 , 2025 | 05:11 AM
తులసిబాబు పోలీస్ కస్టడీ ముగిసిన తర్వాత ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపాలని ప్రాసిక్యూషన్ హైకోర్టును కోరింది.
హైకోర్టుకు నివేదించిన ప్రాసిక్యూషన్
అమరావతి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): నరసాపురం మాజీ ఎంపీ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుపై సీఐడీ కస్టడీలో జరిగిన దాడి వ్యవహారంలో తులసిబాబు పోలీస్ కస్టడీ ముగిసిన తర్వాత ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపాలని ప్రాసిక్యూషన్ హైకోర్టును కోరింది. ట్రయల్ కోర్టు తులసిబాబును మూడు రోజుల పాటు కస్టడీకి ఇచ్చిందని, ఈ నెల 29తో కస్టడీ ముగుస్తుందని సోమవారం నివేదించింది. ఆ తరువాత బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపాలని పోలీసుల తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ కోర్టును అభ్యర్థించారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 31కి వాయిదా వేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan: నువ్వు మరిన్ని రికార్డులు నెలకొల్పాలి.. దేవాన్ష్‌కు పవన్ అభినందనలు
Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News
Updated Date - Jan 28 , 2025 | 05:11 AM