CM Chandrababu: బనకచర్లపై ఒక పార్టీ రాజకీయం చేస్తుంది
ABN, Publish Date - Mar 04 , 2025 | 08:55 PM
CM Chandrababu: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తాజాగా ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో వారిరువురు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలను ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. ఏపీలో బనక చర్ల అంశాన్ని సైతం కేంద్ర మంత్రి దృష్టికి వారిరువురు తీసుకు వెళ్లారు.
అమరావతి, మార్చి 04: తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ తెలుగు దేశం పార్టీ అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలుగు జాతిని అగ్రగామిగా నిలపాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. తనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు ప్రాంతాలు సమానమని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ భవన్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ విజయోత్సవ సభ మంగళవారం సాయంత్రం జరిగింది. ఈ విజయోత్సవ సభలో సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును తాను ఎప్పుడు వ్యతిరేకించ లేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గోదావరిపై ప్రాజెక్టులు నిర్మించండి.. నీళ్లు తీసుకోండంటూ తెలంగాణ పాలకులకు సూచించారు. అలాగే గంగా, కావేరీ నదులను అనుసంధానం చేయాలని ఆయన ఆకాంక్షించారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనతో దేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నడిపిస్తున్నారన్నారు.
దేశం దశ, దిశ మార్చే సంస్కరణలు మాజీ ప్రధాని పీవీ నరసింహరావు తీసుకువచ్చారని వివరించారు. జాతి, రాష్ట్ర ప్రయోజనాలే తన ప్రయోజనాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక బనకచర్ల ప్రాజెక్ట్‌పై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. సముద్రంలోకి పోయే నీళ్లు.. కరువు ప్రాంతానికి తీసుకెళ్తే ఎవరూ బాధపడనక్కర్లేదంటూ తెలంగాణలోని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆయన సూచించారు. గోదావరి నీళ్లు పోలవరం నుంచి బనకచర్లకు తీసుకెళ్తానని గతంలో చెప్పానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సముద్రంలోకి పోయే నీళ్లు తీసుకెళ్తామంటే.. ఒక పార్టీ రాజకీయం చేస్తోందంటూ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు.
తాజాగా జరిగిన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు కూటమి అభ్యర్థిలు భారీ అధిక్యంతో గెలుపొందారు. అంతేకాకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటే.. ఓటింగ్ షేర్ బాగా పెరిగినట్లు ఈ ఎన్నికల్లో క్లియర్ కట్‌గా స్పష్టమైంది. ఇది గత 8 నెలల పాలనకు ప్రజా తీర్పుగా కూటమిలోని నేతలు అభివర్ణిస్తున్నారు. అలాంటి వేళ.. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఎమ్మెల్సీ విజయోత్సవ సభను నిర్వహించారు.
మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తాజాగా ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో వారిరువురు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలను ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు.
అలాగే గోదావరి జలాల వినియోగంలో ఏపీ దూకుడు మీద వెళ్తుందంటూ ఫిర్యాదు చేశారు. అదే విధంగా ఏపీలో బనక చర్ల అంశాన్ని సైతం కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ దృష్టికి తెలంగాణ సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకు వెళ్లారు. అలాంటి వేళ... సీఎం చంద్రబాబు పై విధంగా స్పందించారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం కింద క్లిక్ చేయండి..
Also Read: MLC Elections Result: తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఇవి గమనించారా.. విస్తుపోయే వాస్తవాలు
Also Read: ఏటీఎంలో చోరీ యత్నం.. బిగ్ ట్విస్ట్
Also Read: ముందుల ధరల పెరుగుదల.. సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు
Also Read: కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారు.. ఎప్పటి నుంచి అంటే..
Also Read: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్
Also Read: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్దం.. విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ నెంబర్
Also Read: లోకేష్‌ను ముట్టుకుంటే మసైపోతారు
For AndhraPradesh News And Telugu News
Updated Date - Mar 04 , 2025 | 08:58 PM