Inter Exams: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్దం.. విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ నెంబర్
ABN , Publish Date - Mar 04 , 2025 | 05:10 PM
Inter Exams: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఎగ్జామ్స్ ఇప్పటికే ప్రారంభమైనాయి. తెలంగాణలో మార్చి 5వ తేదీ నుంచి అంటే రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. అందుకు ఇంటర్ బోర్డ్ సర్వం సిద్దం చేసింది. అయితే ఇంటర్ బోర్డ్ పరీక్ష రాసే విద్యార్థులకు ఓ గుడ్ న్యూస్ చెప్పంది.
హైదరాబాద్, మార్చి 04: ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహాణకు బోర్డ్ సర్వం సిద్దం చేసింది. మొదటి సంవత్సరం పరీక్షలు.. రేపటి నుంచి అంటే.. మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అలాగే ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 6వ తేదీ నుంచి మొదలవనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ఇప్పటికే ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9 లక్షల మందికిపైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో అబ్బాయిలు 4,97,528 మంది ఉండగా.. అమ్మాయిలు 4,99,443 మంది ఉన్నారు. వీరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు1,532 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది.
Also Read: ఏటీఎంలో చోరీ యత్నం.. బిగ్ ట్విస్ట్
మరోవైపు ఇంటర్మీడియట్ పరీక్షలకు ఈసారి కూడా ఒక్క నిమిషం ఆలస్యమనే నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ఇంటర్ బోర్డు ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ పరీక్ష ప్రారంభమైన ఐదు నిమిషాల వరకు అంటే.. ఉదయం 9.05 గంటల వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని బోర్డు స్పష్టం చేసింది. పరీక్షా కేంద్రానికి కాస్త ముందుగా చేరుకుంటే ఒత్తిడి, ఆందోళనకు గురయ్యే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయని బోర్డు అధికారులు విద్యార్థులకు సూచించారు. ఇక నిబంధనల ప్రకారం ఉదయం 8.45 గంటల నుంచి 9 గంటల మధ్య.. విద్యార్ధులకు ఓఎంఆర్ పత్రాన్ని అందజేస్తారు. వీటిని విద్యార్థులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
Also Read: లోకేష్‌ను ముట్టుకుంటే మసైపోతారు
పరీక్షల వేళ.. విద్యార్ధుల కోసం బోర్డు కీలక నిర్ణయాలు..
ఈసారి ఇంటర్ హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. దీనిని స్కాన్ చేస్తే పరీక్షా కేంద్రం లొకేషన్ సులువుగా తెలుసుకోవచ్చు.
పరీక్షకు ఒక రోజు ముందు కేంద్రాన్ని పరిశీలిస్తే అన్ని విధాలా మంచిది.
ప్రశ్నపత్రంపై సీరియల్ నెంబరు ముద్రిస్తున్నారు. దీంతో ఏ నెంబర్ ఉన్న పేపర్.. ఏ విద్యార్థికి వెళ్తుందో సులువుగా తెలుస్తుంది. ఒకవేళ అది బయటకు వచ్చినా వెంటనే ఏ పరీక్షా కేంద్రం, ఏ విద్యార్థిదనే విషయాన్ని సులభంగా గుర్తించవచ్చు.
ఈ పరీక్షల వేళ.. స్మార్ట్ వాచ్‌లతోపాటు అనలాగ్ వాచ్‌లను సైతం నిషేధిస్తున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ సారి పరీక్షల వేళ.. చేతి గడియారాలనూ కూడా అనుమతించడం లేదు.
Also Read: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్
ఇంటర్ బోర్డు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)ని ఏర్పాటు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల్లోని సీసీ కెమెరాలను ఈ కేంద్రంతో అనుసంధానించారు. మొత్తం 75 మంది సిబ్బంది.. ఈ పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించనున్నారు.
విద్యార్ధుల పరీక్షలకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే ఈ హెల్ప్‌లైన్ నెంబరు 92402 05555 ను సంప్రదించవచ్చునని బోర్డు కార్యాలయం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌మీడియట్ పరీక్షలు ప్రారంభమైనాయి. మార్చి 1వ తేదీ నుంచి మొదటి సంవత్సరం, మార్చి 3వ తేదీ నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమైనాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు.. హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకొనేందుకు వాట్సప్ నెంబర్‌ను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
For Telangana News And Telugu News