CM Chandrababu : దేశ భవిష్యత్తుకు ఈ బడ్జెట్ బ్లూప్రింట్
ABN, Publish Date - Feb 02 , 2025 | 04:16 AM
‘కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్... సమగ్ర, సమ్మిళిత బ్లూ ప్రింట్.
వికసిత్ భారత్ దార్శనికతను ఇది ప్రతిబింబిస్తోంది: సీఎం చంద్రబాబు
అమరావతి, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ‘కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్... సమగ్ర, సమ్మిళిత బ్లూ ప్రింట్. ఇది దేశ సుసంపన్న భవిష్యత్తుకు హామీ’ అని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. శనివారం ఆయన ఎక్స్ వేదికగా కేంద్ర బడ్జెట్ 2025-26ను స్వాగతిస్తూ స్పందించారు. ‘దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన మధ్యతరగతి ప్రజలకు పన్ను ఉపశమనం కలిగిస్తుంది. బడ్జెట్లో మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారు. రాబోయే ఐదేళ్లలో వృద్ధికి ఆరు కీలక రంగాలను గుర్తించి బడ్జెట్ రూపొందించారు. జాతీయ శ్రేయస్సు వైపునకు కీలక అడుగులను ఈ బడ్జెట్ సూచిస్తోంది. ప్రధాని మోదీ వికసిత్ భారత్ దార్శనికతను ప్రతిబింబిస్తోంది. ప్రజానుకూల, ప్రగతిశీల బడ్జెట్‌ను ప్రవేశపెట్టినందుకు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక మంత్రికి అభినందనలు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
Also Read: ఏపీ జీవనాడికి ఊపిరి పోసిన నిర్మలమ్మ
For AndhraPradesh News And Telugu News
Updated Date - Feb 02 , 2025 | 04:16 AM