Amaravati Capital Event: ఈ రోజు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రోజు..
ABN, Publish Date - May 02 , 2025 | 04:45 PM
Amaravati Capital Event: అమరావతి రాజధాని పున:ప్రారంభోత్సవం జరిగిన రోజు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రోజని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత ఐదు సంవత్సరాలు రాజధాని పనులు ఆగిపోయాయని, విధ్వంసం జరిగిందని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి రాజధాని పున:ప్రారంభోత్సవం జరిగిన రోజు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రోజని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత ఐదు సంవత్సరాలు రాజధాని పనులు ఆగిపోయాయని, విధ్వంసం జరిగిందని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
రాజధాని పున:ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ ఈ రోజు చాలా గొప్ప రోజు. చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు. ఆ రోజు అమరావతి పనులకు ప్రధాని మోదీ గారు శంకుస్థాపన చేశారు. ఐదు సంవత్సరాలు విధ్వంసం జరిగింది. పనులు నిలిచిపోయాయి. మళ్లీ ప్రధాని మోదీ గారే పున:ప్రారంభం చేస్తున్నారంటే.. దీనికంటే మంచి రోజు చరిత్రలో ఇంకోటి లేదని విజ్ణప్తి చేస్తున్నాను’ అని అన్నారు.
ప్రధాని మోదీకి అండగా ఉంటాం
ఉగ్రవాదం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ.. ‘ ముందుగా మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. గతంలో మోదీ గారిని ఎప్పుడు కలిసినా.. చాలా ఆహ్లాదకరంగా ఉండేవారు. కానీ, మొన్న అమరావతి కార్యక్రమానికి పిలవడానికి వెళ్లాను. ఆ మీటింగ్ చాలా గంభీరంగా సాగింది. దీనికి కారణం.. ‘ నా దేశ ప్రజలు ఉగ్రవాదుల దాడిలో చనిపోయారు’ అన్న ఆవేదన మోదీ గారిలో చూశాను. ఈ సందర్భంగా మీ అందరి తరపునా ఆయనకు నేనో విజ్ణప్తి చేస్తున్నాను. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి మోదీ, కేంద్రం తీసుకునే నిర్ణయాలకు మేము అండగా ఉంటాం’ స్పష్టం చేశారు.
రైట్ లీడర్ ఫర్ ది నేషన్
నరేంద్ర మోదీ నాయకత్వం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ రైట్ టైం .. రైట్ లీడర్ ఫర్ ది నేషన్.. దట్ ఈజ్.. నరేంద్ర మోదీజీ. చాలా దృఢమైన నాయకుడు.. బ్యాలెన్స్ కలిగిన నాయకుడు. ప్రపంచం నలుమూలలా ఉన్న ప్రజలందరూ మోదీ నాయకత్వాన్ని మెచ్చుకుంటున్నారు. నరేంద్ర మోదీ తన 11 ఏళ్ల పాలనలో ప్రపంచ ఎకానమీలో దేశాన్ని 10 స్థానం నుంచి 5వ స్థానానికి తీసుకువచ్చారు. ఈ సంవత్సరం జపాన్‌ను వెనక్కు నెట్టి 4వ స్థానంలోకి రాబోతోంది’అని అన్నారు.
Updated Date - May 02 , 2025 | 05:12 PM