ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

High Court Amaravati: హైకోర్టు సీజేతో సీఎం చంద్రబాబు భేటీ

ABN, Publish Date - May 14 , 2025 | 03:51 AM

విజయవాడలో హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అమరావతిలో కొత్త హైకోర్టు డిజైన్లు చూపించి, కర్నూలులో బెంచి ఏర్పాటు, రెరా చైర్మన్‌ నియామకం అంశాలపై చర్చించారు.

నూతన హైకోర్టు భవనం డిజైన్లు చూపించిన సీఎం

కర్నూలులో బెంచ్‌ ఏర్పాటు, రెరా చైర్మన్‌ నియామకంపైనా చర్చ

అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని సీజే నివాసంలో మంగళవారం ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా అమరావతిలో నూతనంగా నిర్మించనున్న హైకోర్టు డిజైన్లను సీజేకి చూపించారు. హైకోర్టు భవన నిర్మాణానికి సంబంధించిన సలహాలు సూచనలు చేయాలని కోరారు. కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటు అంశం వీరి మధ్య చర్చకు వచ్చింది. ఏపీ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చైర్మన్‌ నియామకానికి సీజే ప్యానెల్‌ ఆమోదం తెలపాల్సి ఉన్న నేపథ్యంలో ఆ పదవిలో శివారెడ్డిని నియమించనున్నట్లు సీజేకి చంద్రబాబు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్

CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ

Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..

Updated Date - May 14 , 2025 | 03:51 AM