ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP Bhavan: సంయమనం పాటించండి

ABN, Publish Date - May 14 , 2025 | 05:16 AM

ఏపీభవన్‌లోని ప్రార్థనా మందిరాల తొలగింపు ప్రక్రియను సీఎం చంద్రబాబు అధికారులకు సంయమనం పాటించమని సూచించారు. మతసంస్థల అభిప్రాయాలను గౌరవిస్తూ, ఈ ప్రక్రియను నిలిపివేసి తిరిగి సమీక్షించాలని ఆదేశించారు.

ఏపీ భవన్‌ అధికారులకు సీఎం చంద్రబాబు సూచన

ప్రార్థనా మందిరాల తొలగింపు ప్రక్రియ నిలిపివేత

న్యూఢిల్లీ, మే 13(ఆంధ్రజ్యోతి): ఢిల్లీలోని ఏపీభవన్‌లో ప్రార్థనా మందిరాల తొలగింపు విషయంలో సంయమనం పాటించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఆయా మతాలకు చెందినవారి అభిప్రాయలకు విరుద్ధంగా ఎటువంటి చర్యలు చేపట్టవద్దని సీఎం ఆదేశించారని భవన్‌ అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి సూచనలతో నిర్మాణాల తొలగింపు ప్రక్రియను నిలిపివేశామని స్పష్టం చేశారు. ఏపీభవన్‌లో ఆక్రమణలు, ప్రార్థనా మందిరాల తొలగింపు ప్రతిపాదలపై అధికారులతో చంద్రబాబు మాట్లాడారు. స్థానికులు ఏర్పాటు చేసుకున్న దేవాలయం తొలగింపు విషయంలో అభ్యంతరాలపై వివరణ కోరారు. పంపకాల్లో భాగంగా ఏపీకి వచ్చిన స్థలంలో 0.37 ఎకరాల్లో పలు ఆక్రమణలు ఉన్నాయని, సంప్రదింపుల ద్వారా, చట్టబద్ధంగా వాటి తొలగింపునకు గతనెల నుంచి తీసుకున్న చర్యలను సీఎంకు అధికారులు వివరించారు. అక్రమ నిర్మాణాలతో పాటు అదే ప్రాంతంలో ఉన్న రెండు ప్రార్థనా మందిరాలను కూడా తొలగించే ప్రక్రియ చేపట్టాల్సి ఉందని తెలిపారు. ప్రజలు, మతసంస్థల మనోభావాలు దెబ్బతినే చర్యలు తీసుకోవద్దని చంద్రబాబు సూచించారని భవన్‌ అధికారులు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్

CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ

Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..

Updated Date - May 14 , 2025 | 05:17 AM