ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chandrababu Naidu: ఐదేళ్లలో ఉద్యాన సాగు రెట్టింపు

ABN, Publish Date - May 14 , 2025 | 05:28 AM

హెక్డేకు రూ.లక్ష ఆదాయం లక్ష్యంగా horticulture సాగును విస్తరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వచ్చే ఐదేళ్లలో ఉద్యాన పంటల సాగును రెట్టింపు చేసి, రైతులకు శిక్షణ, మద్దతు అందించాలని సూచించారు.

డిమాండ్‌ ఉన్న పంటలకు ప్రోత్సాహం

రైతుకు ఏటా ఎకరానికి రూ.లక్ష ఆదాయం రావాలి

ఉద్యానశాఖ సమీక్షలో సీఎం ఆదేశాలు

అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): ఉద్యాన రైతులు ఏటా ఎకరానికి కనీసం రూ.లక్ష ఆదాయం ఆర్జించడమే లక్ష్యంగా కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాలు మినహా రాష్ట్రంలోని మిగతా అన్నిచోట్ల ఉద్యాన పంటల సాగును విస్తృతంగా ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం అమరావతి సచివాలయంలో ఉద్యానశాఖపై ఆయన సమీక్ష జరిపారు. మిరప, అరటి, మామిడి, ఆయిల్‌పామ్‌, కోకో, డ్రాగన్‌ఫ్రూట్‌, జీడిమామిడి, కాఫీ, కొబ్బరి, టమాటా, ఉల్లి వంటి 11 పంటలతో 24 క్లస్టర్లు ఏర్పాటు చేసి, రైతులకు తోడ్పాటు అందించాలని నిర్దేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 18.23 లక్షల హెక్టార్లలో ఉన్న ఉద్యాన పంటల సాగును వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేయాలన్నారు. ఆయిల్‌పామ్‌, కోకో, కొబ్బరి రైతులకు సాగు మెలకువలపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రపంచ మార్కెట్‌లో డిమాండ్‌ను అందిపుచ్చుకునేలా లక్ష ఎకరాల్లో కోకో సాగు చేసేలా చూడాలని, పంట నాణ్యతపై రైతులకు శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. వీటికి అనుబంధంగా రైతులే ప్రొసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే మరింత ఆదాయం లభిస్తుందన్నారు. రైతులు పండించే పంటలకు అధిక విలువ తీసుకురావడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ‘మైక్రో ఇరిగేషన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, చిన్న రైతులకు డ్రిప్‌ ఇరిగేషన్‌లో ప్రాధాన్యం ఇవ్వాలి. ఇప్పటికే రైతులు ఏర్పాటు చేసుకున్న డ్రిప్‌కు ఆటోమెషిన్‌ అమర్చాలి. దీని వల్ల నీరు, ఎరువులు ఆదా అవుతాయని రైతులకు అవగాహన కల్పించాలి’ అని సీఎం ఆదేశించారు. ఉద్యాన పంటలపై ప్రతినెలా జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తూ.. 10వేల హెక్టార్లలో పండ్ల తోటలకు రూ.32 కోట్లతో ఫ్రూట్‌ ప్రొటెక్షన్‌ కవర్లు సబ్సిడీపై అందించడం వల్ల రైతులకు రూ.120 కోట్ల అదనపు ఆదాయం లభించిందని ఉద్యానశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసులు సీఎంకు వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్

CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ

Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..

Updated Date - May 14 , 2025 | 05:28 AM