Tirupati SV Zoo Park: తిరుపతి ఎస్వీ జూపార్కులో ఆడ పులి మృతి
ABN, Publish Date - Aug 02 , 2025 | 05:18 PM
తిరుపతి ఎస్వీ జూపార్కులో చికిత్స పొందుతున్న ఓ ఆడ పులి శనివారం మృతి చెందింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు టైగర్ రిజర్వ్ పరిధిలోని బైర్లూటి రేంజ్ ప్రాంతంలో గాయపడిన ఈ పులిని జూలై నెలలో చికిత్స కోసం తిరుపతి జూ పార్క్‌కు తరలించిన విషయం తెలిసిందే.
తిరుపతి: ఎస్వీ జూపార్కులో చికిత్స పొందుతున్న ఓ ఆడ పులి శనివారం మృతి చెందింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు టైగర్ రిజర్వ్ పరిధిలోని బైర్లూటి రేంజ్ ప్రాంతంలో గాయపడిన ఈ పులిని జూలై నెలలో చికిత్స కోసం తిరుపతి జూ పార్క్‌కు తరలించిన విషయం తెలిసిందే.
జూ అధికారులు తెలిపిన ప్రకారం, పులికి శస్త్రచికిత్స చేసిన తర్వాత ఆహారం తినడం మానేసిందని, దాంతో శరీర దృఢత్వం మరింత క్షీణించిందని పేర్కొన్నారు. చికిత్స అందించినప్పటికీ పులి ఆరోగ్యం మెరుగుపడక, చివరికి కోలుకోలేక మృతి చెందింది. పులి మృతిపై అధికారిక నివేదికను సిద్ధం చేసి సంబంధిత వన్యప్రాణి సంరక్షణ అధికారులకు అందించనున్నట్టు జూ వర్గాలు తెలిపాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
ఈ రోజు నాకెంతో స్పెషల్: మంత్రి నారా లోకేష్
గత పాలన సైకో పాలన.. ఆర్థిక విధ్వంసం చేసి అందరినీ ఇబ్బంది పెట్టారు
Read Latest AP News and National News
Updated Date - Aug 02 , 2025 | 05:21 PM