ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Elderly Accused: చిన్నారిపై వృద్ధుడి అత్యాచారం

ABN, Publish Date - Jun 04 , 2025 | 07:25 AM

ఆకివీడులో 70 ఏళ్ల వృద్ధుడు 7 ఏళ్ల బాలికపై దారుణంగా అత్యాచారం చేశాడు. బాలిక మేనమామ నిందితుడిపై బ్లేడ్‌తో దాడి చేసి గాయపడి, పోలీస్‌ స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదైంది.

  • లాక్‌పలో ఉన్న నిందితుడిపై బ్లేడ్‌తో బాలిక మేనమామ దాడి

ఆకివీడు, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో దారుణం చోటుచేసుకుంది. బ్రతుకుదెరువు కోసం తిరుపతి నుంచి ఆర్నెల్ల క్రితం దంపతులు తమ ఏడు సంవత్సరాల కుమార్తెతో స్థానిక సంతమార్కెట్‌లోని పడాలవీధికి వచ్చి అద్దెకు ఉంటున్నారు. అదే ప్రాంతానికి చెందిన షేక్‌ చిన మీరావలి (70) (మాంసం వర్తకుడు) సోమవారం ఆరు బయట ఆడుకుంటున్న బాలికను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మీరావలిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. బాలికకు ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేసి శాంపిల్స్‌ విజయవాడ ల్యాబ్‌కు పంపించారు. బాలిక తల్లిదండ్రులు, బంధువులు, పార్టీల నాయకులు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి నిందితుడిని తమకు అప్పగించాలంటూ పోలీసులతో వాదనకు దిగారు. కొందరు సీఐ జగదీశ్వరరావు, ఎస్‌ఐ నాగరాజుతో ఘర్షణ పడ్డారు. ఇంతలో స్టేషన్‌ లోపలికి వెళ్లిన బాలిక మేనమామ లాక్‌పలో ఉన్న మీరావలిపై దాడి చేసి బ్లేడ్‌తో గాయపర్చాడు. అనంతరం అతను పోలీస్‌ స్టేషన్‌లో సొమ్మసిల్లి పడిపోయాడు. మీరావలిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం భీమవరం తరలించారు. డీఎస్పీ జయసూర్య ఆకివీడు ఆసుపత్రిలో మీరావలిని పరిశీలించారు. ప్రాణాపాయం లేదని వైద్యు లు తెలిపారు. ప్రభుత్వాసుపత్రిలో బాలిక మేనమామ చికిత్స పొందుతున్నాడు. డీఎస్పీ జయసూర్య పర్యవేక్షణ లో ఎస్‌ఐ పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మేనమామపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కాగా.. మీరావలిని కఠినంగా శిక్షించాలని డీఎస్పీ జయసూర్యకు టీడీపీ శ్రేణులు వినతిపత్రం అందజేశాయి.

Updated Date - Jun 04 , 2025 | 07:28 AM