ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu : ఆర్థికం ఘోరం

ABN, Publish Date - Jan 28 , 2025 | 03:04 AM

ప్రభుత్వం వద్ద వెసులుబాటు ఉంటే ఒక్క నిమిషం కూడా ఆగనని స్పష్టం చేశారు. ‘కేంద్రం నుంచి కొన్ని పథకాలకు ...

  • వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది

  • తల తాకట్టు పెట్టయినా హామీలు నెరవేరుస్తాం: సీఎం

  • ప్రభుత్వం వద్ద డబ్బులున్నా హామీలు అమలు చేయడం లేదనుకుంటున్నారు

  • ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది

  • ప్రాజెక్టులకు కేంద్రం ఇచ్చే నిధులను మళ్లించలేం

  • అభివృద్ధి చేయాలి.. సంక్షేమం చూసుకోవాలి

  • ఆదాయం పెంచే మార్గాలను అన్వేషిస్తాం

  • ప్రజలను శాశ్వతంగా పేదరికంలో ఉంచాలనుకోవడం లేదు: సీఎం చంద్రబాబు

ప్రభుత్వం వద్ద డబ్బులున్నా ఇవ్వడం లేదని, హామీలు అమలు చేయడం లేదని కొందరు అనుకుంటున్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో, ఎంత లోతులో కూరుకుపోయి ఉన్నామో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. వివరంగా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాం.

ఐదు రూపాయలిచ్చి ప్రజలను శాశ్వతంగా పేదరికంలో ఉంచాలని మేం అనుకోవడం లేదు. గత ప్రభుత్వం వారికి ఒక రూపాయి ఇచ్చి పది రూపాయలు దోచుకొంది. మేం నిజాయితీగా ప్రజలను అభివృద్ధిలోకి తేవాలని అనుకొంటున్నాం. వాస్తవాలు చెప్పడానికి భయపడదల్చుకోలేదు.

- ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): తల తాకట్టు పెట్టయినా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర హామీలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం వద్ద వెసులుబాటు ఉంటే ఒక్క నిమిషం కూడా ఆగనని స్పష్టం చేశారు. ‘కేంద్రం నుంచి కొన్ని పథకాలకు వచ్చిన నిధులు చూసి రాష్ట్రం వద్ద చాలా డబ్బులు ఉన్నాయని అనుకొంటున్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విశాఖ ఉక్కు కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని నిధులు ఇచ్చింది. వాటిని మళ్లించి సంక్షేమ పఽథకాలకు ఖర్చు చేయడంకుదరదు. మరోరకంగా సర్దుబాటు చేసుకొని సంక్షేమం చేయాలి’ అని అన్నారు.


సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘వైసీపీ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి శ్రీలంక మాదిరిగా ఉందని మేం చెప్పిన మాట నిజం. అది నూటికి నూరు శాతం నిజమని నీతి ఆయోగ్‌ జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై చేసిన అధ్యయనం నిరూపించింది. గత ప్రభుత్వం నాశనం చేసిందని చెప్పి వదిలేయలేం. బాగు చేయాలి. మాపై నమ్మకంతోనే ప్రజలు 93 శాతం సీట్లు గెలిపించి ఇచ్చారు. ఆ నమ్మకం నిలుపుకొంటాం. ప్రతి విషయం ప్రజల ముందు పెడతాం. ఆదాయాన్ని పెంచుకొనే మార్గాలను అన్వేషించి అమలు చేస్తాం. ఆదాయం పెరిగితే అది ప్రజలకే చెందుతుంది. పేదలకు కూడా వెసులుబాటు కల్పించాల్సిన బాధ్యత మాపై ఉంది. గత ప్రభుత్వం అసమర్థత, అవినీతి విధానాలతో రాష్ట్రాన్ని వెనక్కు తీసుకువెళ్లిందన్నది నిజం’ అని చంద్రబాబు అన్నారు.


ఎవరొచ్చినా చేస్తారనుకున్నారు

‘గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో వృద్ధిరేటు 15 శాతం వరకూ వెళ్లిందని, ఎవరు వచ్చినా అభివృద్ధి ఇలాగే ఉంటుందని 2019 ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలు అనుకొన్నారు. కానీ అంచనా తప్పని ఆలస్యంగా అర్థం చేసుకొన్నారు. ఇంతగా దెబ్బ తిన్న రాష్ట్రాన్ని మళ్లీ బాగు చేయగలరా అని నన్ను అనేకమంది అడిగారు. బాగు చేయడానికి పోరాడటం తప్ప ఇక్కడ మరో మార్గం లేదు. కేంద్రం కొంత సాయం చేసింది. మా పరిధుల్లో మేం శాయశక్తులా పనిచేస్తున్నాం. ఈ 7 నెలల్లో రూ.12 వేల కోట్లు విడుదల చేసి.. ఆగిపోయిన కేంద్ర పఽథకాలను పునరుద్ధరించాం. వాటిని పునరుద్ధరిస్తే కానీ కొన్ని పఽథకాల కింద కేంద్ర నిధులు రావు. పళ్ల బిగువన వాటికి డబ్బు సర్దుబాటు చేశాం. ఇవిచెప్పకపోతే ప్రజలకు అర్థం కావు’ అన్నారు.


మళ్లీ ప్రగతి పథంలోకి తెస్తాం

‘గుజరాత్‌లో ఐదుసార్లు నుంచి ఒకే పార్టీ గెలుస్తోంది. దీనివల్ల విధానాలు ఒకేదారిలో నడుస్తున్నాయి. పంజాబ్‌లో తరచూ మారిపోతున్నాయి. దీంతో మొత్తం దేశంలో మన కంటే అధ్వానంగా ఉన్న రాష్ట్రంగా అది తయారైంది. గత 30 ఏళ్ల నుంచి ఏ రాష్ట్రంలో ఏం జరిగిందో.. ఎవరు ఆదాయాలను పెంచారో.. మంచి పాలన ఎవరు ఇచ్చారో నీతి ఆయోగ్‌ అధ్యయనం చేస్తే.. మేం గతంలో ఎంత చాకిరీ చేశామో మొత్తం దేశానికి తెలుస్తుంది. రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతి పథంలోకి తీసుకువచ్చి చూపిస్తాం. ఈసారి రిపబ్లిక్‌ దినోత్సవంలో గవర్నర్‌ ప్రసంగాన్ని మొక్కుబడిగా తయారు చేయలేదు. నిన్న, నేడు, రేపు రాష్ట్రం పరిస్థితి ఏమిటో చెబుతూ మా భవిష్యత్‌ ప్రణాళికకు పది సూత్రాలు అందులో వివరించాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.


అభివృద్ధి.. సంక్షేమం

‘ఆదాయం పెరిగితే రాష్ట్రం ముందుకు వెళ్తుంది. ఆదాయం పెంచడం కోసం ఉన్న డబ్బులు మొత్తం అభివృద్ధి పైనే పెట్టలేం. అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చూడాలి. పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. గతంలో అమలు చేసిన మంచి పాలనా విధానాల వల్ల తెలంగాణలో ఇప్పుడు తలసరి ఆదాయం దేశంలోకెల్లా అధికంగా ఉంది. ఒక మంచి పాలసీ ప్రజల జీవితాలను మార్చేస్తుంది. చైనా 1978లో ఆర్థిక సంస్కరణలు తెచ్చింది. సోవియట్‌ యూనియన్‌ కొంత ఆలస్యంగా రాజకీయ సంస్కరణలు తెచ్చింది. చైనా అమెరికాతో పోటీగా సూపర్‌ పవర్‌గా ఎదిగితే, రష్యా కొంత వెనకబడిపోయింది. ఒక విధానం తెచ్చే మార్పు ఏమిటో ఇదే పెద్ద ఉదాహరణ’ అని చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: నువ్వు మరిన్ని రికార్డులు నెలకొల్పాలి.. దేవాన్ష్‌కు పవన్ అభినందనలు

Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 28 , 2025 | 03:04 AM