Chandrababu Visit: రేపు అనంతలో చంద్రబాబు పర్యటన
ABN, Publish Date - May 08 , 2025 | 05:58 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. హంద్రీనీవా కాలువ విస్తరణ, లైనింగ్ పనులను పరిశీలించి ప్రజలతో మాట్లాడేందుకు ఆయన ఛాయాపురం వెళ్లనున్నారు
హంద్రీనీవా కాలువ విస్తరణ, లైనింగ్ పనుల పరిశీలన
అనంతపురం, మే 7(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో హంద్రీనీవా కాలువ విస్తరణ, లైనింగ్ పనులను సీఎం పరిశీలిస్తారు. ముఖ్యమంత్రి కార్యాలయం బుధవారం అధికారికంగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఉదయం విజయవాడ విమానాశ్రయం నుంచి బయల్దేరి శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలం ఛాయాపురానికి.. ఆ తర్వాత రోడ్డు మార్గాన ఆ గ్రామ సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్దకు చేరుకుంటారు. అనంతరం జలవనరుల శాఖ అధికారులతో సమావేశమవుతారు. ఛాయాపురం ప్రజలతో ముఖాముఖి మాట్లాడతారు. ఆ తర్వాత బెంగళూరుకు పయనమవుతారు.
Updated Date - May 08 , 2025 | 05:58 AM