ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chandrababu Meets Nirmala Sitharaman: దేశంలో తొలిసారిగా ఈ తరహా విధానం..

ABN, Publish Date - Mar 05 , 2025 | 06:40 PM

ఇటీవలే ఏపీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు వివరించారు. వివిధ మార్గాల్లో ఇప్పటి వరకు కేంద్రం అందించిన సాయంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Nirmala Sitharaman And Chandrababu

ఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఏపీకి ఆర్థికంగా మరిన్ని వెసులుబాట్లు కల్పించే అంశంపై నిర్మలా సీతారామన్‌తో సీఎం, ఆర్థిక మంత్రి చర్చలు జరిపారు. ఇటీవలే ఏపీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ వివరాలను ఆమెకు వివరించారు. క్యాపిటల్ ఎక్స్‌పెడించర్ నిధుల కోసం ప్రత్యేకంగా వీజీఎఫ్ స్కీం ప్రవేశపెట్టడంపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలో తొలిసారిగా ఈ తరహా విధానం ఉందన్న చర్చల్లో భాగంగా నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు.

వీజీఎఫ్ స్కీంలో భాగంగా కార్పస్ ఫండ్ నిమిత్తం రూ. 2 వేల కోట్లు కేటాయించామని సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల వివరించారు. వివిధ మార్గాల్లో ఇప్పటి వరకు అందించిన సాయంపై నిర్మలా సీతారామన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఇక పైనా ఇదే తరహా సహకారం ఉండాలని.. వీలైనన్ని కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేసేందుకు సిద్దంగా ఉన్నామని, తమకు నిధులు కూడా అదే స్థాయిలో వచ్చేలా చూడాలని కేంద్ర ఆర్థిక మంత్రిని సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యావుల కోరారు.


Also Read:

ఫస్ట్ ఇది నేర్చుకో.. జగన్‌కు నాదెండ్ల మనోహర్ స్ట్రాంగ్ కౌంటర్..

ఆ నిర్మాణాల తొలగింపులో నిర్లక్ష్యంపై హైకోర్ట్ సీరియస్

Updated Date - Mar 05 , 2025 | 07:41 PM