Nadendla Manohar: ఫస్ట్ ఇది నేర్చుకో.. జగన్‌కు నాదెండ్ల మనోహర్ స్ట్రాంగ్ కౌంటర్..
ABN , Publish Date - Mar 05 , 2025 | 05:49 PM
'ఆ మనిషి కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ' అంటూ పవన్ కళ్యాణ్‌పై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు.
అమరావతి: మాజీ సీఎం జగన్‌పై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. వై నాట్ 175 అని ఎగిరిన మనిషి 11కు పడిపోవడంతో మతి భ్రమించి, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జర్మనీ చట్టాలు ఏపీలో అమలు చేస్తానంటే ఎలా? అని ప్రశ్నించారు. తాడు బొంగరం లేని పార్టీ వైసీపీ అని సెటైర్లు వేశారు. ఇంగిత జ్ఞానం లేదు కాబట్టే తనకు తాను శాశ్వత పార్టీ అధ్యక్షుడిగా జగన్ ప్రకటించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రజా జీవితంలో ఒక్క రూపాయి అయినా ఇచ్చి దాతగా జగన్ నిలబడ్డారా ? మా అధినేత పవన్ కళ్యాణ్ వేలాదిమందికి ఆర్ధిక సాయం చేశారని అన్నారు.
ఒక్కరోజైనా నిజాయితీగా పనిచేశారా?
నిన్నటి పట్టభద్రుల ఎన్నికల్లో తీర్పు ఇచ్చింది యువత కాదా? సూపర్ 6 గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మాటకు కట్టుబడి ఉంటూ విలువలతో కూడిన రాజకీయాలు చేయటం జగన్ అలవాటు చేసుకోవాలని సూచించారు. రైతులకు ధాన్యం కొనుగోళ్లు బకాయిలు పెట్టి వెళ్లిపోయిన వారు ఇవాళ రైతుల గురించి మాట్లాడుతున్నారని, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నిజాయితీగా ఒక్కరోజైనా జగన్ పనిచేశారా? అని ప్రశ్నించారు.
కోడికత్తికి ఎక్కువ.. గొడ్డలికి తక్కువ..
అధికారంలో ఉండగా వర్క్ ఫ్రమ్ హోమ్ ముఖ్యమంత్రిగా ముద్రపడిన వ్యక్తి, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ బెంగుళూరు ఎమ్మెల్యేగా మారాడని ఎద్దేవ చేశారు. జగన్ కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అని మేం అనలేక కాదు, మాకు సభ్యత ఉందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసి తీరుతుందని మంత్రి వ్యాఖ్యానించారు.
Also Read:
వంశీ కేసు.. కోర్టులో పోలీసుల పిటిషన్
రాజధాని అమరావతి ఘోస్ట్ సిటీ.. మరోసారి విషం కక్కిన వైసీపీ నేతలు..