Vamsi Case: వంశీ కేసు.. కోర్టులో పోలీసుల పిటిషన్
ABN , Publish Date - Mar 05 , 2025 | 04:24 PM
Vamsi Case: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి కోర్టును ఆశ్రయించారు పోలీసులు. వంశీని మరోసారి కస్టడీకి కోరుతూ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.

విజయవాడ, మార్చి 5: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో ఫిర్యాదుదారుడు సత్యవర్థన్‌పై బెదిరింపు కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని (Former MLA Vallabhaneni Vamsi) మరో పదిరోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో (Vijayawada SC, ST Court) పోలీసులు ఈరోజు (బుధవారం) పిటిషన్ దాఖలు చేశారు. గతం వారం మూడు రోజుల కస్టడీలో వంశీ సహకరించలేదని పోలీసులు తెలిపారు. చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదని, ఆధారాలతో అడిగినా స్పందించలేదని పిటీషన్‌లో పేర్కొన్నారు. మరో పది రోజుల పాటు వంశీని కస్టడీకి ఇస్తే...ఈ కేసుకు సంబంధించి కీలకమైన సమాచారం రాబట్టే అవకాశం ఉందని కోర్టుకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.
గతంలో కూడా పది రోజుల పాటు వంశీని కస్డడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా.. న్యాయాధికారి కేవలం మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతిచ్చారు. అయితే మూడు రోజుల కస్టడీలో కూడా పోలీసులకు వంశీ సహకరించని పరిస్థితి. ఏ ప్రశ్న వేసినా తెలీదు, మరిచిపోయాను అంటూ సమాధానాలు దాటవేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అప్పట్లోనే మరోసారి వంశీని కస్టడీ కోరతామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే నేడు ఎస్సీ, ఎస్టీ కోర్టులో వంశీని కస్టడీకి కోరుతూ పిటిషన్ వేసిన పోలీసులు.. అందుకు కారణాలను కూడా న్యాయస్థానానికి తెలియజేశారు. ఆధారాలు, సీసీ టీవీ ఫుటేజ్‌లు, ఇతర ముద్దాయిలను చూపించి పదే పదే ప్రశ్నించినప్పటికీ వంశీ నుంచి సరైన సమాచారం రాలేదని కోర్టుకు తెలిపారు.
AP High Court Serious: ఆ నిర్మాణాల తొలగింపులో నిర్లక్ష్యంపై హైకోర్ట్ సీరియస్
అందువల్ల వంశీని మరో పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌లో తెలిపారు. అంతేకాకుండా సత్యవర్థన్ కిడ్నాప్, బెదిరింపుల వ్యవహారం మొత్తం కూడా వంశీ కనుసన్నల్లోనే జరిగిందని, మాజీ ఎమ్మెల్యే ఆదేశాలతో బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు సాక్షాలు సేకరించారు. ఈ క్రమంలో వంశీని మరోసారి కస్టడీకి ఇస్తే అన్ని రకాల ఆధారాలను సేకరించే అవకాశం ఉందని పిటిషన్‌లో తెలిపారు. ఈ పిటిషన్‌పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో రేపు (గురువారం) వాదనలు కొనసాగనున్నాయి. అయితే వంశీని కస్టడీకి సంబంధించి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. వంశీని కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతి ఇస్తుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.
ఇవి కూడా చదవండి...
Nagababu: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు
Lokesh Speech at AP Assembly: తల్లికి వందనంపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
Read Latest AP News And Telugu News