Lokesh Speech at AP Assembly: తల్లికి వందనంపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
ABN , Publish Date - Mar 05 , 2025 | 11:15 AM
Minister Lokesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలుకొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శాసనసభలో తల్లికి వందనం పథకంపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే గైడ్‌లైన్స్ ఇస్తామని చెప్పారు.

అమరావతి, మార్చి 5: కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన తల్లికి వందనం పథకం ఎప్పుడు అమలులోకి వస్తుంది, ఎవరెవరికి స్కీమ్ వర్తిస్తుంద అనే దానిపై రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) క్లారిటీ ఇచ్చారు. ఏపీ శాసనసభలో (AP Legislative Assembly) తల్లికి వందనం పథకంపై (Thalliki Vandanam Scheme) మాట్లాడుతూ.. ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. ఇంట్లో చదువుకునే బిడ్డలందిరికీ తల్లికి వందనం వర్తిస్తుందని స్పష్టం చేశారు. తల్లికి వందనం పథకంపై శాసనసభలో వైసీపీ సభ్యులు పంపిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ త్వరలో ఇస్తామని చెప్పారు.
బడ్జెట్‌లో రూ.9407 కోట్లు ఈ పథకానికి కేటాయించామన్నారు. గత ప్రభుత్వంలో వారు సంవత్సరానికి రూ.5,540 కోట్లు కేటాయించారని.. గతంతో పోలిస్తే ఇది 50 శాతం అధికమని చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ముందుకు బాబు సూపర్ – 6 అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లామని.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తల్లికి వందనం పథకాన్ని ఆనాడు చంద్రబాబు ప్రకటించారని తెలిపారు. భారతదేశంలో రీప్లేస్ మెంట్ రేట్‌లో తమిళనాడు తర్వాత స్థానంలో ఏపీ ఉందన్నారు. మే నెలలో తప్పనిసరిగా ఇంటిలో ఎంత మంది చదువుకునే బిడ్డలు ఉంటే అంతమందికి పథకాన్ని వర్తింపజేస్తామని మంత్రి తేల్చిచెప్పారు.
Ayyanna Serious on Jagan: జగన్ ప్రతిపక్ష హోదాపై స్పీకర్ క్లారిటీ
నిర్ణయించేది ప్రజలే...
అలాగే జగన్‌కు ప్రతిపక్ష హోదాకు సంబంధించి స్పీకర్‌పై సాక్షి పత్రికలో తప్పుడు ప్రచారాలపై లోకేష్ స్పందిస్తూ.. ఎవరు ఎక్కడ ఉండాలో నిర్ణయించేది ప్రజలే అని తెలిపారు. సాక్షి పత్రికలో స్పీకర్ పై తప్పుడురాతలు బాధాకరమన్నారు. చట్ట సభలు చూస్తూ పెరిగినవాడినని, చిన్నవయసులో చట్టసభలను చూశానని తెలిపారు. అప్పట్లో వ్యక్తిగత దూషణలు ఉండేవి కావని.. ప్రజలకు ఏమి కావాలో దానిపైనే చర్చలు జరిగేవని చెప్పారు. చట్టసభల్లో ఇది తనకు రెండో అవకాశమని.. తొలిసారి శాసనసభకు వచ్చినట్లు తెలిపారు. ఇటీవల ప్రతిపక్ష సభ్యులు బాధ్యత చేయకుండా గవర్నర్ స్పీచ్‌ను డిస్ట్రబ్ చేసి వెళ్లారన్నారు. గతంలో తాము నిరసన తెలియజేసినప్పుడు బెంచిల వద్దే ఉండి ధర్నా చేశామని.. పోడియం వద్దకు రాలేదని.. తాము ఎప్పుడూ లక్ష్మణరేఖ దాటలేదని చెప్పుకొచ్చారు. తాను అసెంబ్లీలో కొత్త మెంబర్‌ని అని.. పార్లమెంటులోని 121సి నిబంధన ప్రకారం ప్రతిపక్ష హోదాకు టోటల్ నెం.లో 1/10 ఉండాలని స్పష్టంగా ఉందని తెలిపారు. అసెంబ్లీ కండీషన్స్ ఫర్ రికగ్నిషన్‌లో కూడా ఈ విషయం పొందుపర్చబడి ఉందన్నారు.
ఇది కరెక్ట్ కాదు...
జగన్ మోహన్ రెడ్డి 13, జూన్, 2019న అసెంబ్లీలో మాట్లాడుతూ... చంద్రబాబుకు 23 మంది సభ్యులు ఉన్నారని.. ఐదుగురిని లాగేస్తే ఆయనకు ప్రతిపక్ష స్టేటస్ కూడా ఉండదని సభ సాక్షిగా వ్యాఖ్యానించారని తెలిపారు. స్పీకర్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేయడం హౌస్ పరువును తగ్గిస్తుందని... సాక్షి పత్రికలో తప్పుడు రాతలు బాధాకరమన్నారు. ఎవరు ఎక్కడ ఉండాలో ప్రజలు నిర్ణయిస్తారని.. ప్రజాప్రతినిధులుగా ప్రజలు తరపున పోరాడాల్సి ఉందన్నారు. జగన్‌మోన్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా జడ్ ప్లస్ పాయింట్స్ అని సెక్యూరిటీ ఇచ్చామన్నారు. ప్రభుత్వం ఎక్కడా వ్యక్తిగత కక్షలకు వెళ్లడం లేదని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించడం, దానిని హౌస్‌పైన రుద్దడం బాధాకరమని అన్నారు. ఎవరు అధికారంలో ఉన్నా ఇది కరెక్టు కాదని.. చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు జరిగితేనే ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Chandrababu : వైసీపీ ఆటలు సాగనివ్వను
Karimnagar: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో.. బీజేపీ ముందంజ
Read Latest AP News And Telugu News