Govt Land Protection: ప్రభుత్వ భూముల రక్షణలో సవాళ్లు
ABN, Publish Date - Jul 05 , 2025 | 03:38 AM
రాష్ట్రంలోని విలువైన ప్రభుత్వ భూ ముల రక్షణలో రెవెన్యూ శాఖకు పలు సవాళ్లు ఎదురవుతున్నాయని ఏపీ సివిల్ సర్వీసెస్(ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) అసోసియేషన్ నేతలు పేర్కొన్నారు.
అధిగమించేందుకు అవసరమైన మద్దతు ఇవ్వండి
సీఎంకు ఏపీ సివిల్ సర్వీసెస్ అసోసియేషన్ వినతి
అమరావతి, జూలై 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని విలువైన ప్రభుత్వ భూ ముల రక్షణలో రెవెన్యూ శాఖకు పలు సవాళ్లు ఎదురవుతున్నాయని ఏపీ సివిల్ సర్వీసెస్(ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) అసోసియేషన్ నేతలు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులకు అవసరమైన చట్టపరమైన, ఆర్థిక, సంస్థాగత మద్దతు అందించాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేసినట్లు అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విశ్వేశ్వరనాయుడు, తాతా మోహనరావు ఓ ప్రకటనలో తెలిపారు. పట్టణ, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల రక్షణలో సవాళ్లు నెలకొన్నాయని, ఇవి కేవలం పాలనా సమస్యలే కాకుండా.. చట్ట, ఆర్థిక, సంస్థాగతపరంగా ఉన్నాయన్నారు. వీటిని అధిగమించేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టితో పాటు తగిన నిబంధనలు అవసరమని పేర్కొన్నారు.
Updated Date - Jul 05 , 2025 | 03:40 AM