ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Police : రేషన్‌ బియ్యం మాయం కేసులో ఆరో నిందితుడిగా పేర్ని నాని

ABN, Publish Date - Jan 01 , 2025 | 04:04 AM

తన గోదాముల్లో రేషన్‌ బియ్యం మాయం వ్యవహారం లో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని వెంకట్రామ య్య(నాని)పై మచిలీపట్నం తాలూకా పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.

  • నగదు బదిలీలన్నీ ఆయన ఆదేశాలతోనే!

  • గోడౌన్‌ మేనేజర్‌ అంగీకారం

  • దాంతోనే మాజీ మంత్రిపై కేసు నమోదు

  • తెల్లవారుజామున అరెస్టుకు యత్నం

  • అదృశ్యమై హైకోర్టుకు వెళ్లిన మాజీ మంత్రి

  • 6 వరకు తొందరపాటు చర్యలొద్దు: హైకోర్టు

మచిలీపట్నం, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): తన గోదాముల్లో రేషన్‌ బియ్యం మాయం వ్యవహారం లో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని వెంకట్రామ య్య(నాని)పై మచిలీపట్నం తాలూకా పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఆయన్ను ఆరో నిందితుడు(ఏ-6)గా చేర్చారు. ఆయన గోడౌన్‌లో మేనేజరుగా పనిచేస్తున్న మానసతేజను పోలీసులు చె న్నైలో మూడ్రోజుల కిందట అరెస్టుచేసిన సంగతి తెలిసిందే. ఆయన్ను విచారించగా.. మేనేజర్‌ బ్యాంకు ఖాతా నుంచి రూ.24 లక్షలను మిల్లు యాజమాని బొర్రా ఆంజనేయులు, లారీడ్రైవర్‌ బోట్ల మంగారావు, పేర్ని కుటుంబసభ్యు ల బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్లు తేలింది. పేర్ని నాని సూచనల మేరకే ఈ నగదును వివిద భ్యాంకు ఖాతాలకు జమ చేసినట్లు మానసతేజ పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఈ వివరాలను నమోదుచేసిన పోలీసులు ఉన్నతాధికారుల సూచనల మేరకు పేర్ని నానిపై కేసు నమోదు చేశారు. ఆయన్ను అరెస్టు చేసేందుకు మంగళవారం తెల్లవారుజామున ప్రయత్నించారు. ఇది తెలిసి ఆయన అదృశ్యమయ్యారు. ఆ తర్వాత ముందస్తు బెయిల్‌ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.

Updated Date - Jan 01 , 2025 | 04:07 AM