Tirumala Car Blaze: కారులో చెలరేగిన మంటలు
ABN, Publish Date - Apr 19 , 2025 | 05:29 AM
తిరుమలలో ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి దగ్ధమైంది. ఇంజిన్‌లో పొగలు రావడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి
తిరుమల, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): అకస్మాత్తుగా మంటలు చెలరేగి తిరుమలలో శుక్రవారం ఓ కారు దగ్ధమైంది. ఒంగోలుకు చెందిన నరేంద్ర ఐదుగురు కుటుంబ సభ్యులతో శుక్రవారం వేకువజాము 4.30 గంటలకు తిరుమల చేరుకుని, సీఆర్వో వెనుకభాగంలో కారు నిలిపారు. ఈ క్రమంలో కారు ఇంజన్ నుంచి పొగలురావడం మొదలయ్యాయి. దీంతో కారు దూరంగా వెళ్లి అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చేలోపే భారీగా మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేశారు.
Updated Date - Apr 19 , 2025 | 05:29 AM