ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Labor Welfare: టీడీపీ జెండాలోనే కార్మిక శక్తి

ABN, Publish Date - May 02 , 2025 | 05:40 AM

టీడీపీ కార్మికుల పట్ల ఉన్న నిబద్ధతకు జెండాలోనే కార్మికుల చిహ్నం నిదర్శనమని పంచుమర్తి అనురాధ అన్నారు. చంద్రబాబు కార్మికుల కోసం కోటి మందికి బీమా, ఉచిత ఇసుక విధానాలు అమలు చేశారని పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మేడే వేడుకలు

అమరావతి, మే 1(ఆంధ్రజ్యోతి): ‘తెలుగుదేశం పార్టీ జెండాలోనే కార్మికుల చిహ్నం ఉంది. పార్టీకి కార్మికుల పట్ల ఉన్న నిబద్ధతకు ఇదే నిదర్శనం’ అని మండలి చీఫ్‌ విప్‌ పంచుమర్తి అనురాధ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ.. ‘2017లోనే కోటి మంది కార్మికులకు బీమా ఇప్పించిన ఘనత చంద్రబాబుది. ఉచిత ఇసుక విధానం ద్వారా 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఊతమిస్తున్నారు’ అని అన్నారు. ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్‌ మాట్లాడుతూ.. కార్మికులకు చెందాల్సిన రూ.వేల కోట్లను వైసీపీ హయాంలో దారి మళ్లించారని విమర్శించారు. బయో డైవర్సిటీ చైౖర్మన్‌ నీలాయపాలెం విజయకుమార్‌ మాట్లాడుతూ.. కోట్లాది రూపాయలతో రాజధాని పనులు ప్రారంభం కావడంతో కార్మికులు రాష్ట్రం నుంచి వలస పోయే పరిస్థితి నుంచి రాష్ట్రానికే కార్మికులు వలస వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీలు పర్చూరి అశోక్‌బాబు, దువ్వారపు రామారావు, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం ఛైర్మన్‌ గొట్టిముక్కల రఘురామరాజు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి

ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం

PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు

Read Latest AP News And Telugu News

Updated Date - May 02 , 2025 | 05:40 AM