Brahmin Chaitanya Vedika, కన్నప్పలో బ్రాహ్మణులను కించపరిచారు
ABN, Publish Date - Jun 08 , 2025 | 05:26 AM
మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమాలో పిలక, గిలక అనే పాత్రలు పెట్టి బ్రాహ్మణ సంప్రదాయాన్ని అవమానించారని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ, అర్చక సేవా సంఘం..
గుంటూరులో బ్రాహ్మణ చైతన్య వేదిక నిరసన
గుంటూరు, జూన్ 7(ఆంధ్రజ్యోతి): మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమాలో పిలక, గిలక అనే పాత్రలు పెట్టి బ్రాహ్మణ సంప్రదాయాన్ని అవమానించారని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ, అర్చక సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంధ్యాల రామలింగేశ్వర శాస్ర్తి మండిపడ్డారు. ఇందుకు నిరసనగా శనివారం గుంటూరు శంకర్ విలాస్ సెంటర్లో ‘శివయ్యకు అపచారం-తిన్నడుకు అన్యాయం’ పేరుతో శివలింగాన్ని ఏర్పాటు చేసి ఏకరుద్రాభిషేకాలు చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ, అర్చక పురోహిత బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ప్రదర్శన చేపట్టారు.
Updated Date - Jun 08 , 2025 | 05:29 AM