Daggubati Purandeswari: ప్యారిస్ లో పురందేశ్వరి
ABN, Publish Date - May 27 , 2025 | 05:38 AM
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేయడానికి పురందేశ్వరి ప్యారిస్‌కు వెళ్లారు. పహల్గాం ఉగ్రదాడి వంటి ఘటనలను వివరించేందుకు భారత ప్రభుత్వం ఏర్పరిచిన అఖిలపక్ష బృందంలో ఆమె భాగస్వామి.
పాక్ ఉగ్రవాదాన్ని అక్కడ ఎండగట్టనున్న భారత బృందం
న్యూఢిల్లీ, మే 26(ఆంధ్రజ్యోతి): పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఎండగట్టేందుకు బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఫ్రాన్స్ రాజధాని ప్యారి్‌సకు చేరుకున్నారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తదితరాలను ప్రపంచదేశాలకు వివరించేందుకు కేంద్రప్రభుత్వం ఏడు అఖిలపక్ష ఎంపీల బృందాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నేతృత్వం వహిస్తున్న బృందంలో పురందేశ్వరి సభ్యురాలు. ఈ బృందం ప్యారి్‌సలో పర్యటిస్తోంది. ఉగ్రవాదంపై భారతదేశం చేస్తున్న పోరాటం, పహల్గాంలో అమాయకులైన పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి తదితరాలను ఈ బృందం ప్యారిస్ ప్రతినిధులకు వివరించనుంది.
ఇవి కూడా చదవండి..
PM Modi: నా బుల్లెట్ రెడీ.. పాక్‌కు మోదీ వార్నింగ్
మోదీ రోడ్‌షోలో కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబసభ్యులు
జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్‌మెన్‌ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్‌కు షాక్
ఆపరేషన్ సిందూర్‌పై ముందుగానే పాక్‌కు లీక్.. పెదవి విప్పిన జైశంకర్
For National News And Telugu News
Updated Date - May 27 , 2025 | 05:38 AM